కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బీజేపీ నేత అయినప్పటికీ టీడీపీ ఆయన్ను తమవాడిగానే ఓన్ చేసుకుంటుందన్న సత్యం అందరికీ తెలిసిందే. అయితే.. కొద్దికాలంలో టీడీపీలో వెంకయ్యను వ్యతిరేకిస్తున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోందట. ఇంతకుముందు కూడా వెంకయ్యపై గుస్సా ఉన్నవారున్నా కూడా ఇప్పుడు అలాంటివారంతా తమ అభిప్రాయాలను బాహాటంగానే వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీ ప్రకటించిన తరువాత ఈ ధోరణి బాగా పెరిగిందంటున్నారు. ప్యాకేజీ ప్రకటించిన తర్వాత వెంకయ్యనాయుడుకు ఆ పార్టీ నేతలు సన్మానాలు చేస్తున్నారు. వాటికి టీడీపీ నేతలూ హాజరవుతున్నారు. అలా తమ నేతలు హాజరవడంపై తెదేపా ప్రజాప్రతినిధులు అభ్యంతరం చెబుతున్నారు. రెండు రోజులుగా కేఎల్ యూనివర్శిటీలో ప్రారంభమైన తెదేపా వర్క్ షాప్ లో జరిగిన చర్చల్లో మాట్లాడిన పలువురు ఎమ్మెల్యే - ఎంపి - నియోజకవర్గ ఇంచార్జిలు వెంకయ్య సన్మానాలకు టీడీపీ నేతలు వెళ్లడంపై నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను ప్రకటించడమే దీనికి ఉదాహరణ.
హోదా ఇవ్వకుండా ప్యాకేజీ ఇచ్చిన వైనంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని - దాన్ని తొలగించాల్సిన బాధ్యత తమ పార్టీపైనే ఉందని పలువురు ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. హోదా కంటే ప్యాకేజీ వల్ల లాభమన్న అభిప్రాయం చదువుకున్న వారిలో ఉన్నప్పటికీ - సామాన్య జనంలో మాత్రం హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందన్న అభిప్రాయం ఉందంటున్నారు. అలాంటప్పుడు ప్యాకేజీ సాధించినందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు జరుగుతున్న సన్మానసభల్లో టీడీపీ నేతలు పాల్గొనడం ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తుందని అంటున్నారు.
మరికొందరు మాత్రం హోదా ఇక రాదని తేలిపోయిందని.. ప్యాకేజీ వచ్చింది కాబట్టి దాని వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు చేరవేయడంపై దృష్టి పెడితే చాలని.. వెంకయ్య సన్మానాలకు వెళ్లడమా వెళ్లకపోవడమా అన్నది ఆయా నేతల ఇష్టమని అంటున్నారు. అయితే, మెజారిటీ ప్రజాప్రతినిధులు మాత్రం హోదా విషయంలో జనం వెంకయ్యను ఇప్పటికీ ద్రోహిగానే చూస్తున్నారు కాబట్టి ఆ సన్మానాలకు వెళ్లకపోవడమే బెస్టని చంద్రబాబుకు సూచించారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/