13 జిల్లాల్లో ఎక్కడెక్కడో ఉన్న విస్తరించి ఉన్న సీనియర్ నాయకకులు ఇప్పుడు లోకేష్ బాబు ఎక్కడున్నాడో ఆరాలు తీయాలా? తమ కలలు తీరాలంటే.. వీలైనంత అర్జంటుగా లోకేష్ బాబు ఎక్కడున్నాడో తెలుసుకుని - కలుసుకుని.. తమ తమ విన్నపాలను సమర్పించుకోవాలా? ముందుగా లోకేష్ బాబు ప్రసన్నం అయితే తప్ప.. వారి ఆశలు తీరానికి చేరే అవకాశం లేదా? ... ఇలాంటి చర్చలే ఇప్పుడు ఏపీ తెలుగుదేశం పార్టీలో నడుస్తున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి వర్గ విస్తరణ గురించి కీలకమైన్ ఫీలర్ ఇచ్చిన వెంటనే.. ఈ పదవి మీద ఆశలు పెంచుకుంటున్న వారందరూ ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యారు. పైగా ప్రస్తుతం ఉన్న కేబినెట్ ఖాళీలను భర్తీ చేయడం మాత్రమే కాకుండా - పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని చెప్పడం ద్వారా - కొత్తగా ఎక్కువమందికే అవకాశాలు తలుపులు తడతాయని చంద్రబాబునాయుడు సంకేతాలు ఇచ్చేశారు.
ఆ విషయానికి వస్తే.. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం సగటు జిల్లాకు ఒకరు అంతకంటె ఎక్కువ మందే మంత్రి పదవులను ఆశిస్తున్న సీనియర్ - వృద్ధ నాయకులు ఉన్నారు. జిల్లాల వారీగా వస్తే కర్నూలులో భూమా నాగిరెడ్డి - అనంతపురంలో పయ్యావుల కేశవ్ - కడప మినహాయించి అటు చిత్తూరులో గాలి ముద్దుకృష్ణమనాయుడు - నెల్లూరులో సోమిరెడ్డి - ఒంగోలులో మాగుంట శ్రీనివాసులురెడ్డి.. ఇలా ప్రతి జిల్లాకు కనీసం ఒకరు కలలు కంటూనే ఉన్నారు. వీరందరికీ చోటు ఇవ్వడం మాత్రం సాధ్యం కాదు. అయితే ముందుగా లోకేష్ ను కలిసి.. తమ విధేయతను నిరూపించుకుని - అర్హతలను ప్రదర్శించుకుని.. ప్రసన్నం చేసుకుంటే రేసులో ముందుంటామని సీనియర్లు రెడీ అవుతున్నారట. దీనిని బట్టి.. ఇప్పుడు ఈ ప్రకటన ద్వారా అందరిలో ఆశలు రేపిన చంద్రబాబు.. ఆ పర్వం పూర్తి చేసే వరకు లోకేష్ .. ఇలాంటి సీనియర్ల మొరలు ఆలకిస్తూ బిజీగా ఉంటారన్నమాట.