ప‌రాభ‌వాల సైకిల్ యాత్ర‌.. నేర్పుతున్న లెస్స‌న్ ఇదే!

Update: 2021-11-17 10:01 GMT
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ యాత్ర ప‌రాభావాల‌ను మూట‌గ‌ట్టుకుని ముందుకు సాగుతోంది. ఎక్క‌డికక్క డ పుంజుకుంటుంద‌ని.. పుంజుకోవాల‌ని.. భావించిన పార్టీ.. చ‌తికిల ప‌డుతున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపి స్తోంది. కీల‌క‌మైన చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోనూ వైసీపీ జెండా ఎగ‌రేసేలా.. ముందుకు సాగిన వైనాన్ని.. తాజా ఫ‌లితం.. స్ప‌ష్టంగా క‌ళ్ల‌కు క‌ట్టింది. అయితే.. దీనికి టీడీపీ చెప్పుకొనే స‌ర్దుబాటు మాట‌.. వైసీపీ అరాచ‌కం చేసింద‌ని.! కానీ. ఇది నిజ‌మేనా?  అయితే.. ద‌ర్శి వంటి మునిసిపాలిటీని గెలిచినా.. ఆకివీడు వంటి చోట్ల‌.. పైచేయి సాధించేంత మెజారిటీ వ‌చ్చినా.. జ‌గ్గ‌య్య పేట‌లో అధికార పార్టీకి చెమ‌ట‌లు ప‌ట్టించే ప‌రిస్థితి తెచ్చినా.. దీనికి కార‌ణం ఎవ‌రు?

పార్టీ బ‌లంగా లేక‌పోవ‌డం కాదు.. వైసీపీ దారుణాలు చేయ‌డం అంత‌క‌న్నా కాదు.. ఇప్పుడు టీడీపీలో లేనిద‌ల్లా.. అంకిత భావంతో ముందుకు సాగుతున్న నాయ‌క‌గ‌ణ‌మే! అంకిత భావం.. ఇది మ‌న పార్టీ.. ఇక్క‌డ పార్టీ జెండా ఎగ‌రాల‌ని.. భ‌వించిన నాయ‌కులు ప‌నిచేసిన చోట‌.. పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. దీనికి ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌న‌మే.. ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి. అదేవిధంగా కృష్ణాజిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌లోనూ 8 వార్డుల‌ను టీడీపీ ద‌క్కించుకుంది. అలాగే.. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోని క‌మ‌లాపురంలోనూ 5 వార్డుల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. కానీ, టీడీపీకి ప‌ట్టుంద‌ని భావించిన రాజ‌ధాని జిల్లా గుంటూరులో మాత్రం చ‌తికిల ప‌డింది.

దీనికి రీజ‌నేంటి? ఇదీ.. ఇప్పుడు టీడీపీ చేయాల్సిన అంత‌ర్మ‌థ‌నం. నిజానికి అధికార పార్టీదే పైచేయి అని అనుకుంటే.. ఆయా చోట్ల కూడా పుంజుకునే ప‌రిస్థితి ఉండేదికాదు. కానీ, ఎక్క‌డో టీడీపీలోనే ల‌లోపం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉంద‌నే ధోర‌ణి నాయ‌కుల్లో క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో రెండున్న‌రేళ్లు అయినా.. కూడా పార్టీలో ఇంకా.. గ‌త ఓట‌మి తాలూకు భావాలు పోక‌పోవ‌డం.. పార్టీని న‌డిపించే క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌పై విశ్వాసం స‌న్న‌గిల్ల‌డం.. చాలా చోట్ల అధికార పార్టీ నేత‌ల‌తో టీడీపీ నేత‌లు తెర‌చాటు స్నేహాలు చేస్తూ.. కాంట్రాక్టులు ద‌క్కించుకోవ‌డం.. వంటివి పార్టీకి అశ‌నిపాతంగా మారాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

లేక‌పోతే.. వైసీపీపై వ్య‌తిరేకత ఉంద‌ని.. పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించేది లేద‌ని.. క‌రాఖండీగా చెప్పిన త‌ర్వాత‌.. కూడా ప్ర‌జ‌లు ఇంకాఆ  పార్టీవైపే మొగ్గు ఎందుకు చూపార‌నేది ప్ర‌శ్న‌. అదేస‌మ‌యంలో.. అభివృద్ధి లేద‌ని.. టీడీపీ నేత‌లే చెబుతున్నారు. ప్ర‌జ‌ల మైండ్ సెట్ మారింద‌ని అంటున్నారు. మ‌రి దీనిని ఓట్ల రూపంలో ఎందుకు మ‌లుచుకోలేక‌పోయారు. అంటే.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌క‌త్వం.. చాలా వ‌ర‌కు.. క్షీణించిపోయింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా.. స‌మూల ప్ర‌క్షాళ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News