ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదో విచిత్రం. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకొనే టీడీపీలో వైపరిత్యం! ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికార పార్టీ ఎంపీ ఆందోళనకు దిగారు. అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే - నగర మేయర్ తీరును నిరసిస్తూ. ఇంకా కొసమెరుపు ఏంటంటే...సాక్షాత్తు పార్టీ- ప్రభుత్వ రథసారథి నారా చంద్రబాబు నాయుడు దీక్ష వద్దంటూ వారించినప్పటికీ ఆయన మాటను 'లైట్' తీసుకొని తన దీక్షను తాను చేసుకుంటూ పోయారు. ఈ చిత్రానికి వేదికయింది అనంతపురం అయితే ఆ తెలుగుదేశం పార్టీ ఎంపీ పేరు జేసీ దివాకర్ రెడ్డి!
అనంతపురం నగరంలో రోడ్ల విస్తరణకు స్థానిక ఎమ్మెల్యే - నగర మేయర్ అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి నిరసన దీక్షను చేపట్టారు. నగర పాలకసంస్థ కార్యాలయం ఎదుట ఎంపీ నిరసనదీక్ష ప్రారంభించారు. నగరంలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారిందని - ప్లాస్టిక్ వినియోగం నిషేధించాలని - రోడ్లను విస్తరించాలని డిమాండ్ చేశారు. తాను ఈ పనులు చేస్తుంటే ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి - నగర మేయర్ స్వరూప అడ్డుపడుతున్నారని ఆరోపించారు. మీరు ఎంపీకి సహకరిస్తే ఏసీబీ కేసులు పెట్టిస్తామంటూ ఎమ్మెల్యే బెదిరిస్తూ కార్పొరేషన్ అధికారులు - ఉద్యోగులు తమకు సహకరించకుండా చేస్తున్నారని జేసీ ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా పాతవూరులోని తిలక్ రోడ్డు - గాంధీబజార్ రోడ్డు ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. దీంతో తానే ప్రభుత్వం నుంచి రూ.70 కోట్ల నిధులు మంజూరుచేయించానన్నారు. ఖర్చు చేయకపోవడంతో నిధులు గత 11 నెలలుగా మురిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.అయితే దీక్ష విరమించాలని మున్సిపల్ అధికారులు నచ్చజెప్పినా దివాకర్ రెడ్డి వినిపించుకోలేదు. ఎంపిని పరీక్షించిన వైద్యులు షుగర్ లెవెల్స్ పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పోలీసులు శిబిరంలోకి చొరబడి ఎంపీని బలవంతంగా వాహనంలోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. జేసీని పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్ తరలించాలని సూచించారు. దీంతో పోలీసులు దివాకర్ రెడ్డిని హైదరాబాద్ కు తరలించారు.
కొసమెరుపుః నిరసన దీక్ష చేపడుతానని మూడు రోజుల క్రితం దివాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా దీక్ష చేయవద్దని జిల్లా నేతల ద్వారా జేసీకి సూచించారని సమాచారం. ఆదివారమే ఆ మేరకు కబురుపెట్టారని తెలుస్తోంది. చంద్రబాబు వద్దని వారించినా దివాకర్ రెడ్డి సోమవారం నిరసన దీక్ష చేపట్టారు.