టీడీపీకి కంట్లో నలుసుగా మారారనే ప్రచారం ఎదుర్కొంటున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని తరచుగా పార్టీపైనా, నాయకులపైనా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఆయన ఎక్కడ ఏ కార్యక్రమంలో పాల్గొంటున్నా.. టీడీపీకి, ఆ పార్టీ లోకల్ లీడర్లకు చురుక్కుమనిపించేలా కామెంట్లు చేస్తున్నారు. రెండు రోజుల కిందట తన సొంత సోదరుడు కేశినేని శివనాథ్‌పైనే తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేశినేని.. తాజాగా మరో కార్యక్రమంలో పాల్గొని.. స్థానిక నాయకులపై విమర్శలు గుప్పించారు. దీంతో ఆ టీడీపీ ఎంపీ మళ్లీ ఏసేశాడు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
పార్టీలో ఉంటూ.. నాయకులుగా చలామణి అవడం కాదని.. పార్టీ కోసం పని చేయాలని కేశినేని నాని అన్నారు. అంతేకాదు.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంతో మంది నాయకులు ఉన్నారని ప్రచారం చేస్తున్నారని..ఇప్పటి వరకు ఎంత మంది ఉన్నా.. ఇక్కడ ఒక్క పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోలేక పోయారని..పరోక్షంగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సహా మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌పై విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. నీతి నిజాయితీ, పార్టీ శ్రేణులకు ఆమోద యోగ్యమైన అభ్యర్థి ఉంటే వచ్చే ఎన్నికలలో 25వేల మెజారిటీతో టీడీపీ విజయం ఖాయమని కేశినేని నాని వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. కేశినేని నాని వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు రాజకీయంగా చైతన్యం కలిగినవారని, ఇక్కడ గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. కానీ, 2009లో ఇక్కడ ప్రజారాజ్యం తరఫున వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచారు. కానీ, ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. గతంలో కమ్యూనిస్టులు కూడా విజయం దక్కించుకున్నా.. అధికారం చేపట్టలేదు.
మరోవైపు.. 2019 ఎన్నికలలో ఎమ్మెల్యే స్థానం పోయినా... ఎంపీగా తనకు 15 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారంటూ... కేశినేని.. లోకల్ నేతలపై విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ విజయం కోసం అందరూ కలిసి పని చేయాలని, ఎంతమంది నాయకులు ఉన్నా... పార్టీ కార్యాలయం పెట్టలేక పోయారని దుయ్యబట్టారు. జైన్ అనే వ్యక్తి ఇటీవల ముందుకు వచ్చి పార్టీ కార్యాలయం కట్టించారని, టీడీపీకి పశ్చిమ నియోజకవర్గం ఒక మోడల్‌గా నిలవాలన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.