మూడున్నర దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో ఎన్నో సంచలనాలకు వేదిక అయ్యింది హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్. ఈ ట్రస్ట్ భవన్ నుంచే ఎన్టీఆర్ జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పే స్థాయికి చేరుకున్నారు. ఒకానొక దశలో ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్నప్పుడు ఆయనకు ప్రధానమంత్రి ఛాన్స్ కూడా వచ్చింది. ఇలా ఎన్నో సంచలనాలకు వేదిక అయిన ఈ ఎన్టీఆర్ భవన్ ఇప్పుడు పూర్తిగా కళ కోల్పోయింది.
తెలుగు ప్రజలు రెండు రాష్ర్టాల ప్రజలుగా విడిపోయారు. ఏపీకి చెందిన ఎన్టీఆర్ రామారావు స్థాపించిన టీడీపీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో దశాబ్దం తర్వాత అక్కడ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎంగా ఉన్నారు. దీంతో ఆయన అక్కడ పాలనా వ్యవహారాల్లో నిమగ్నమయ్యారు. ఇక కొత్తగా ఏర్పడిన రాష్ర్టం కావడంతో అక్కడ కొత్త రాజధానితో పాటు ఆర్థిక లోటు ఇలా రకరకాల సవాళ్లు చంద్రబాబు ముందున్నాయి. దీంతో చంద్రబాబు కాని ఆయన తనయుడు లోకేష్ గాని తెలంగాణ పార్టీ వ్యవహారాలను పూర్తిగా పట్టించుకోవడం మానేశారు.
ఇక తెలుగుదేశానికి తెలంగాణలో ఫైర్ బ్రాండ్ రేవంత్ - సత్తుపల్లి ఎమ్మెల్యే వీరయ్య - ఎల్.రమణ - రావుల ఇలా ఒకరిద్దరు నేతలు మాత్రమే మిగిలారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా…12 మంది ఎమ్మెల్యేలు గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ కార్యక్రమాలు కూడా యాక్టివ్ గా లేకపోవడంతో పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఎవ్వరూ ట్రస్ట్ భవన్ వైపు చూడడం లేదు. కళా విహీనంగా మారిన ట్రస్ట్ భవన్ ను ఇప్పుడు ఐటీ లేదా మల్టీనేషన్ ల కంపెనీలకు అద్దెకు ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ట్రస్ట్ భవన్ ను అద్దెకు ఇచ్చేస్తే లోయర్ ట్యాంక్ బండ్ లోని పార్టీ గ్రేటర్ శాఖ కార్యాలయాన్ని రాష్ట్ర కార్యాలయంగా మార్చే యోచనలో బాబు - లోకేష్ ఉన్నారట. ఇక ట్రస్ట్ భవన్ కోసం లోకేష్ కు సన్నిహితులైన కొందరు ఐటీ కంపెనీల యజమానులు పరిశీలించినట్టు సమాచారం. ఏదేమైనా తెలుగు రాజకీయాలను శాసించి, రాజకీయాలను సామాన్యుడికి దగ్గర చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నేడు ఇలా కళావిహీనమవ్వడం కాస్త బాధాకరమే.