ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సీనియర్ రాజకీయ కుటుంబం జేసీ బ్రదర్స్‌కు.. గత ఎన్నికల్లో తాడిపత్రి నుంచి విజయం దక్కిం చుకున్న వైసీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గతంలో మీ అంతు చూస్తా నంటూ. పెద్దారెడ్డి ఏకంగా.. జేసీ ఇంటికే వెళ్లిన విషయం తెలిసిందే. తర్వాత.. కూడా జేసీలకు వ్యతిరేకంగా ఆయన రాజకీయాలు చేశారు. ఇక.. ఆ తర్వాత.. కూడా ఇరు పక్షాల మధ్య తీవ్ర రాజకీయ యుద్ధాలు సాగాయి. అయితే.. ఈ విషయంలో ఏం జరిగిందో ఏమో.. తాడపత్రి మునిసిపల్ ఎన్నికల సమయంలో జరిగిన ఘటన తర్వత ఇరు పక్షాలు కూల్ అయ్యారు.
తాడిపత్రి మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలకు బొటాబొటిగా ఫలితం దక్కింది. దీంతో జనసేన సభ్యుడి ఓటు కీలకంగా మారడంతో.. ఈ విషయంలో జోక్యం చేసుకున్న వైసీపీ.. అధిష్టానం అప్పట్లో దీనిని వదిలేయాలని..ఎమ్మెల్యే కేతిరెడ్డికి సూచించినట్టు చెబుతారు. అప్పట్లో దీనిని జేసీ దక్కించుకుని తాడిపత్రి మునిసిపాలిటీని దక్కించుకున్నారు. అయితే.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న జేసీ వర్సెస్ పెద్దారెడ్డి వివాదం .. తాజాగా మరో సారి తెరమీదికి వచ్చింది. తాడిపత్రి మండలంలోని సజ్జలదిన్నె వద్ద తాడిపత్రి మున్సిప ల్ చైర్మన్ జేసీ ప్రభాక ర్‌రెడ్డిని రూరల్ సీఐ చిన్నపెద్దయ్య అడ్డుకున్నారు.
ఆలూరుకోన రంగనాథస్వామి కల్యాణోత్సవం, రథోత్స వాన్ని పురస్కరించుకొని అనుచరులతో కలిసి వెళు తుండగా సీఐ అడ్డుకున్నారు. కల్యా ణోత్సవ కార్యక్ర మానికి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హాజరయ్యారని ఆయన వెళ్లిన తర్వాత వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా సీఐకి, మున్సిపల్ చైర్మన్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మీరు అక్కడికి వెళ్లడం వల్ల శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని అడ్డుకు నేందుకు అవసరమైన సిబ్బంది లేరని మున్సిపల్ చైర్మన్‌కు సీఐ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
నేను కొట్లాటకు వెళ్లడం లేదని ఒకవేళ జరిగితే అడ్డుకొనే దమ్ము మీకు లేదా అని జేసీ మండిపడ్డారు. ఒకవేళ రావొద్దంటే వచ్చేవాళ్లంకాదుకదా.. ఇప్పుడు అడ్డుకొంటే వినేది లేదని వెళ్లి తీరేదేనని అరెస్ట్‌చేసుకుంటే చేసుకోవాలంటూ సీఐ మాట వినకుండా కిలోమీటర్ వరకు నడు చుకుంటూ వెళ్లారు. చివరికి కొద్దిసమయం తర్వాత స్వయంగా నేనే తీసుకువెళతానని సీఐ చెప్పడంతో జేసీ శాంతించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే.. ఇది మున్ముందు.. ఎటు దారితీస్తుందో నని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.