ఇప్పుడు ఇదో ప్రధాన చర్చగా మారింది. వైసీపీలోకి కొందరు కీలక నేతలకు తమ బంధువులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు అందడం లేదని.. వారిని వెలి వేసినట్టుగా వ్యవహరిస్తున్నారని.. టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఈ జాబితాలో కమ్మ సామాజికవ ర్గానికి చెందిన ఒక మంత్రి సహా.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని అంటున్నారు. అదేసమయంలో బీసీ సామాజికవ ర్గానికి చెందిన మరో మంత్రి కూడా ఈజాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అసలు ఏం జరుగుతోంది? అనే చర్చ వైసీపీలోనూ అంతర్గతంగా సాగుతుండడం గమనార్హం.
నిజానికి రాజకీయనేతలను ఎవరైనా.. తమ ఇళ్లలో జరుపుకొనే కార్యక్రమాలకు, పెళ్లిళ్లలకు విశేష ఆహ్వానితుల కింద ఆహ్వానా లు పంపుతారు. ఇది సంప్రదాయంగా వస్తున్నదే. అయితే.. ఇటీవల కాలంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ ఇళ్లలో పెళ్లిళ్లు జరిగాయి. అదేవిధంగా ఒక పారిశ్రామిక వేత్త విల్లా గృహప్రవేశాన్ని ఘనంగా నిర్వహించారు. అయితే.. వైసీపీలోని చాలా మంది నేతలకు ఆహ్వానాలు అందినా.. కమ్మ వర్గానికి చెందిన మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు, బీసీ వర్గానికి చెందిన మరో మంత్రికి ఆహ్వానాలు అందలేదు. దీంతో వారిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. అసలు ఏం జరిగింది? అని వారు చర్చించుకుంటున్నారు.
వాస్తవానికి రాజకీయాల్లో ఉన్న నాయకులు.. ప్రత్యర్థులపై విమర్శలు చేస్తుంటారు. ఇలానే వైసీపీలో ఉన్ననాయకులు కూడా ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారు. అయితే.. వీటిని టీడీపీ నేతలు సామాజికవ ర్గాలకు అంటగట్టి.. సామాజిక వర్గాల వారిగా.. ఆయా నేతలను దూరం పెట్టేలా.. తెరవెనుక చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. అంటే.. ఇప్పటి వరకు ఏ సామాజిక వర్గం ఆధారంగా ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కుతూ.. ముందుకు సాగుతున్నారో.. అలాంటి సామాజికవ ర్గాన్ని దూరం చేయడం ద్వారా.. వీరిని ఇరుకున పట్టాలని నిర్నయించుకున్నట్టు తెలుస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు.
అయితే.. ఇలాంటి రాజకీయాలు మంచివి కావని అంటున్నారు. అయితే.. దీనివల్లతమకు వచ్చిన నష్టం లేదని.. సదరు నేతలు చెబుతున్నారు. ఏదేమైనా.. సామాజికవ ర్గాలు ఇలా వ్యవహరించడం.. కొందరిని పిలిచి కొందరిని దూరం పెట్టడం.. సరైన చర్యేనా? ఇలా అయితే.. రేపు ఎన్నికల నాటికి పరిస్థితి మరింత తీవ్రం అయ్యే ప్రమాదం లేదా? అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.