టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ.. ప్లీన‌రీపై జ‌గ‌న్ వ్యూహ‌మేంటి..?

Update: 2022-07-08 01:58 GMT
శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌లకు గుంటూరు జిల్లా రంగా వ‌ర్సిటీ.. ఎదురుగా ఉన్న ప్రాంగ‌ణంలో వైసీపీ ప్ర‌తిష్టాత్మ‌క ప్లీన‌రీ కార్య‌క్ర‌మం ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు నిర్వ‌హించే ఈ ప్లీన‌రీకి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్ప‌టికే పూర్త‌య్యాయి. అయితే.. ఈ ప్లీన‌రీని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న వైసీపీ అధిష్టానం.. దీనిని టీడీపీ మ‌హానాడు క‌న్నా ఎక్కువ‌గా విజ‌యం చేయాల‌ని.. భావిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ పోలిక ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం? అస‌లు జ‌గ‌న్ వ్యూహం ఏంటి? అనేది చూడాలి.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డ‌మే ధ్యేయంగా జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు. ఎన్నిక‌ల‌కు రెండు సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉన్నందున‌.. ఆయ‌న ఇప్ప‌టి నుంచే ప్ర‌చారం ప్రారంభించారు. గ‌డ‌ప‌గ‌డ‌పకు ప్ర‌భుత్వం ఉద్దేశం అయినా..

బీసీ మంత్రుల బ‌స్సు యాత్ర అయినా.. టీడీపీ వ్యూహాల‌ను నిలువ‌రించేం దుకేన‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే.. ఇప్పుడు ప్లీన‌రీ వేదిక‌గా.. జ‌గ‌న్ ఏం చెబుతారు?  వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు ఏం సందేశం ఇస్తారు.. అనేది ఇంట్ర‌స్ట్‌గా మారింది.

టీడీపీ గ‌త మేలో నిర్వ‌హించిన మ‌హానాడుకు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. దీనికి కార‌ణం.. ప్ర‌భు త్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌. ధ‌ర‌ల పెంపు స‌హా.. ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌ల‌తో చంద్ర‌బాబుపై ఆశ‌ల‌తో ఎక్కువ మంది మ‌హానాడు బాట‌ప‌ట్టారు. అయితే.. ఇప్పుడు ప్ర‌భుత్వ ప‌క్షంగా ఉన్న వైసీపీ..

త‌న‌కు ప్ర‌జ‌లు అనుకూలంగా ఉన్నార‌ని చెబుతున్న నేప‌థ్యంలో ఈ అనుకూల‌.. జ‌నాల‌ను ఎలా త‌ర‌లించాల‌నేది పెద్ద ఇబ్బందిగా మారింది. ప్ర‌జ‌లు అనుకూలంగా ఉన్నా.. వారంత‌ట వారు వ‌చ్చే ప‌రిస్థితి ఉండ‌దు.

వారిని నాయ‌కులు తీసుకురావాలి. కానీ, ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై ఎమ్మెల్యేలు, కొంద‌రు ఎంపీలు కూడా గుర్రుగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో మ‌హానాడు త‌ర‌హాలో ప్లీన‌రీని విజ‌య‌వంతం చేయాల‌ని భావిస్తున్నా.. ఇది సాధ్య‌మేనా? అనేది సందేహంగా మారింది. మ‌రోవైపు.. ఎంత సంక్షేమం ఇస్తున్నా.. రాష్ట్రంలోఅనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. వాటిని ప‌రిష్క‌రించేందుకు.. ప్ర‌జ‌ల్లో ప్ర‌జ‌ల్లో వైసీపీ పై ఉన్న భారీ అంచ నాల‌కు అనుగుణంగా.. వైసీపీ అధినేత ఏదైనా దిశానిర్దేశం చేస్తారా? అనేది కూడా ఆస‌క్తిగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News