త‌మిళ‌నాడులో 17 ఏళ్ల బాలుడితో 24 ఏళ్ల టీచ‌ర్ రొమాన్స్‌!

Update: 2022-10-14 04:36 GMT
నేడు స‌మాజంలో నైతిక విలువ‌లు ప‌త‌న‌మ‌వుతున్నాయి. సోష‌ల్ మీడియా ప్ర‌భావం, ఓటీటీల్లో విచ్చ‌ల‌విడిగా అందుబాటులో ఉన్న అశ్లీల కంటెంట్‌, ఇంట‌ర్నెట్ అందుబాటులో ఉండ‌టంతో త‌లెత్తుతున్న పెడ ధోర‌ణుల‌తో స‌మాజం క‌లుషిత‌మైపోయింది. మాన‌వ సంబంధాలు విచ్చిన్న‌మ‌వుతున్నాయి. విద్యార్థుల‌కు మంచి విద్యాబుద్ధులు నేర్పి వారిని స‌రైన మార్గంలో న‌డిపించాల్సిన టీచ‌ర్లే గ‌తి త‌ప్పుతున్నారు.

త‌మిళ‌నాడులో ఒక 24 ఏళ్ల మ‌హిళా టీచ‌ర్ 17 ఏళ్ల ఇంట‌ర్ కుర్రాడితో ప్రేమాయ‌ణం న‌డిపింది. అత‌డితో త‌న శారీర‌క వాంఛ‌ల‌న్నీ తీర్చుకుంది. ఆ త‌ర్వాత అత‌డిని దూరంగా ఉంచ‌డంతో ఆ ఎడ‌బాటును త‌ట్టుకోలేక అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకెళ్తే.. తమిళనాడులోని అంబత్తూరులో 24 ఏళ్ల యువతి స్థానికంగా ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ప‌నిచేస్తోంది. స్కూల్ లో పాఠాలు చేబుతూనే సాయంత్రం పూట‌ తన ఇంటి వద్ద ట్యూషన్ కూడా చెబుతోంది. దీంతో చాలా మంది పిల్లలు ట్యూషన్ కు వచ్చేవారు. ఈ క్ర‌మంలో కుల్లికుప్పం ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియెట్ చ‌దువుతున్న 17 ఏళ్ల‌ యువకుడు కూడా ఆమె వ‌ద్ద‌కు ట్యూష‌న్‌కు వెళ్లేవాడు. ఈ క్ర‌మంలో 24 ఏళ్ల మ‌హిళా టీచ‌ర్ 17 ఏళ్ల యువ‌కుడిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపింది. దీంతో స‌హ‌జంగానే వ‌య‌సులో ఉన్న యువ‌కుడు కూడా ఆమె ప్రేమ‌లో ప‌డిపోయాడు.

ఇక అప్ప‌టి నుంచి ఇద్ద‌రూ స‌ర్వ సుఖాలు అనుభ‌వించారు. ఆ యువ‌కుడితో టీచ‌ర్ శారీర‌క వాంఛ‌లు తీర్చుకుంది. ఇలా కొన్నాళ్ల‌పాటు గుట్టుగా ఇద్ద‌రూ త‌మ ప్రేమాయ‌ణాన్ని కొన‌సాగించారు. వాట్సాప్‌లో పొద్దుపోయాక కూడా చాట్ చేసుకునేవారు. ఇద్దరూ చనువుగా ఉన్న సమయంలో ఫొటోలు, సెల్ఫీలు కూడా తీసుకున్నారు.

అయితే ఇంత‌లో 24 ఏళ్ల టీచ‌ర్‌కు ఆమె ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆమె కూడా త‌న పెద్ద‌లు కుదిర్చిన పెళ్లికి ఒకే చెప్పింది. ఈ క్ర‌మంలో త‌న 17 ఏళ్ల ప్రేమికుడిని దూరం పెట్టింది. అత‌డితో మాట్లాడ‌టం మానేసింది. అత‌డితో క‌ల‌వ‌డం లేదు. దీంతో ఆమెను ఎంతో ప్రాణంగా ప్రేమించిన కుర్రాడు న‌లిగిపోయాడు. కార‌ణం తెలుసుకుంటే ఆమె వేరే వ్య‌క్తిని పెళ్లాడ‌బోతుంద‌ని తెలుసుకున్నాడు.

దీంతో ఆ మైనర్ బాలుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన ప్రియురాలు లేకుండా బ‌త‌క‌లేన‌ని నిర్ణ‌యించుకున్నాడు. దీంతో ఇంట్లోని బెడ్ రూమ్‌లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. బాలుడి త‌ల్లి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచార‌ణ‌లో సంచలన విష‌యాలు వెలుగుచూశాయి. బాలుడి ఫోన్ ను ప‌రిశీలించ‌గా టీచ‌ర్‌తో వాట్సాప్ చాట్, కాల్స్ రికార్డులు బ‌య‌ట‌ప‌డ్డాయి.

టీచ‌ర్ అత‌డిని ప్రేమ పేరుతో లొంగ‌దీసుకుందని, ప్ర‌స్తుతం ఆమెకు పెళ్లి కుద‌ర‌డంతో అత‌డిని దూరం పెట్టింద‌ని తెలుసుకున్నారు. దీంతో అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.  దీంతో పోలీసులు నిందితురాలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులో వైర‌ల్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News