బీహార్ కా షేర్ మాట్లాడుతున్నా.. తేజస్వి వీడియో వైరల్

Update: 2021-01-22 01:30 GMT
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు బీజేపీ-జేడీయూ కూటమిని ఓడించినంత పనిచేసిన ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ మాట్లాడిన ఓ ఫోన్ కాల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆందోళన చేస్తున్న టీచర్ల దగ్గరకు వెళ్లిన తేజస్వి ఓ సామాన్యుడిలా డీఎం సాబ్ కు ఫోన్ చేసిన మాట్లాడిన వీడియో.. ఆ తర్వాత తనెవరో చెబితే అధికారులు షేక్ అయిన వైనం  ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బీహార్ రాజధాని పాట్నాలో  తమ సమస్యలపై టీజర్లు ధర్నా చేయడానికి రెడీ అయ్యారు. ముందుగా నిర్ణయించుకున్న స్థలంలో అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వ అధికారులను కోరారు. అయితే అనుమతి ఇవ్వకపోగా.. పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు.

దీంతో విషయం తెలుసుకున్న తేజస్వి యాదవ్ తన మద్దతు టీచర్లకు తెలిపేందుకు ధర్నా చేస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు. వెంటనే చీఫ్ సెక్రటరీ, పోలీస్ చీఫ్ లతోపాటు డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ (డీఎం)తో ఫోన్ లో మాట్లాడి ధర్నాకు పర్మిషన్ ఇప్పించారు.

 చుట్టూ ఉపాధ్యాయులు ఉండగా.. తేజస్వి యాదవ్ జిల్లా మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ కు ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టి మరీ మాట్లాడారు. నిరసన తెలిపేందుకు ఉపాధ్యాయులను అనుమతించిండని కోరారు.  అయితే 'నువ్వెవరు.. నన్ను ప్రశ్నిస్తున్నావా?' అని డీఎం తేజస్విని ఫోన్ లో హెచ్చరించగా.. తన పేరు 'తేజస్వి యాదవ్' అని చెప్పాడు. దీంతో డీఎం బెదిరిపోయి సారీ సార్ అని తేజస్వికి క్షమాపణలు చెప్పాడు. పర్మిషన్ ఇస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.

Tags:    

Similar News