రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయితీలకు కొదవ లేదు. విభజన తర్వాత పలు అంశాలపై ఎవరికి వారు వినిపించే వాదనతో ఇప్పటికి చాలానే పంచాయితీలు ఉన్నాయి. ఈ విషయంలో ఎవరూ వెనక్కి తగ్గకపోవటంతో రెండు రాష్ట్రాల మధ్యనున్న వివాదం ముదిరి పాకాన పడింది. ఎవరికి వారు తమ వాదనలే కరెక్ట్ అని చెప్పటం.. వారి మధ్యలో ఎవరైనా మధ్యవర్తిత్వం చేసినా.. వారి నిర్ణయాన్ని లైట్ తీసుకున్న పరిస్థితి.
చివరకు.. రెండు రాష్ట్రాల మధ్యన నెలకొన్న విద్యుత్ పంపిణీ వివాదం.. అంతకంతకూ పెరిగి.. ఎవరికి వారు విద్యుత్ పంపిణీని కట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న దాని ప్రకారం తెలంగాణకు పంపిణీ చేసిన విద్యుత్‌కు సంబంధించి ఏపీకి దాదాపు 4వేల కోట్ల మేర తెలంగాణ రాష్ట్రం బకాయిలు పడిందంటూ ఏపీ ఆరోపిస్తోంది.
దీనిపై రియాక్ట్ అయిన తెలంగాణ రాష్ట్ర అధికారులు.. ఏపీనే తమకు బకాయిలు ఉన్నారంటూ కొత్త లెక్కను తెర మీదకు తీసుకొచ్చింది. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం.. ఏపీ ఉత్పత్తి చేసే థర్మల్ విద్యుత్ లో 53.89 శాతాన్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో.. తెలంగాణ ఉత్పత్తి చేసే థర్మల్ విద్యుత్ లో 46 శాతాన్ని ఏపీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన తెలంగాణ నుంచి ఏపీ 1054 మెగావాట్లు.. ఏపీ నుంచి తెలంగాణ 1513 మెగావాట్ల విద్యుత్ ను పంపిణీ చేస్తోంది. రెండు రాష్ట్రాల మధ్యన నెలకొన్న బకాయిల వివాదం ముదిరి.. చివరకు రెండు రాష్ట్రాలు తాము పంపిణీ చేసే విద్యుత్‌ను బంద్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో.. ఏపీకి రావాల్సిన తెలంగాణ కరెంట్ ఆగిపోగా.. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాల్సిన విద్యుత్ ను ఏపీ అధికారులు ఆపేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శనివారం అర్థరాత్రి నుంచి రెండు ప్రభుత్వాలు పోటాపోటీగా తాము పంపిణీ చేసే విద్యుత్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరీ.. వివాదం ఎక్కడి వరకూ వెళుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/