ప్రత్యర్థులపై దమ్ముగా విమర్శలు సంధించే తెలంగాణ బీజేపీ నేతల్లో ఎంపీ అర్వింద్ ముందుంటారు. విషయం ఏదైనా సరే.. సీఎం కేసీఆర్ అండ్ కోపై దుమ్మెత్తి పోసే విషయంలో ఆయనకు మించినోళ్లు మరొకరు లేరన్నట్లుగా ఆయన మాట తీరు ఉంటుంది. అలాంటి అర్వింద్ కు.. సొంత పార్టీకి చెందిన కేంద్రమంత్రి చేసిన ప్రకటనతో కొత్త సినిమా మొదలైనట్లేనని చెబుతున్నారు.
ఎవరెన్నిచెప్పినా.. నిజామాబాద్ ఎంపీగా ఆయన గెలిచారంటే అది కవిత మీద ప్రజల్లో ఉన్న కోపం మాత్రమే కాదు.. కేంద్రంలో కొలువు తీరేది బీజేపీ సర్కారు.. ఆ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే.. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న కల నిజమవుతుందని భావించారు. అందుకే.. ప్రత్యేకంగా ఓట్లువేసి మరీ గెలిపించారు. ఈ ఎన్నిక మొత్తం పసుపు బోర్డు ఏర్పాటు చుట్టూనే తిరిగింది. ఈ ఎన్నిక సమయంలోనే పసుపు రైతులుపెద్ద ఎత్తున నామినేషన్లు వేయటం దేశ వ్యాప్తంగా సంచలనంతో పాటు.. హాట్ టాపిక్ గా మారింది.
కేంద్రంలో రెండోసారి మోడీ సర్కారు కొలువు తీరి రెండేళ్లకు దగ్గర పడుతున్న పసుపు బోర్డు అతిగతీ లేదు. ఇలాంటి వేళలో టీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి సరైన సమయంలో సరైన ప్రశ్నను సంధించారు. పసుపు బోర్డును తెలంగాణలో పెట్టే ఆలోచన లేదని తేల్చయటంతో దమ్ముగా మాట్లాడే ఎంపీ అర్వింద్ కు పసుపు బోర్డు దెబ్బకు నోట మాట రావటం కష్టమవుతుందని చెబుతున్నారు.
ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న గులాబీ దండు.. అర్వింద్ పై విరుచుకుపడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. పసుపు బోర్డు తేలేకపోతే.. రాజీనామా చేస్తానని ప్రకటించిన అర్వింద్ ఇప్పుడేం చేస్తారన్నది ప్రశ్న. తాను మాట మీద నిలబడే నేతను అన్న విషయాన్ని చాటి చెప్పాలనుకుంటే.. అర్వింద్ తన ఎంపీపదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. మరి.. ఆయన నిర్ణయం ఏమై ఉంటుందన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. మొత్తంగా చూస్తే.. దమ్ముగా మాట్లాడే అర్వింద్ కు ఇక పసుపు దడ మొదలైనట్లేనని చెప్పక తప్పదు.