తెలంగాణ గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తమిళిసై సౌందరరాజన్ వద్దకు ఎట్టకేలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాలిపోయారు. తమిళిసై గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టి ఇప్పటికే 80 రోజులు దాటిపోతోంది. అయితే గవర్నర్ గా పదవి చేపట్టిన తర్వాత కనీసం మర్యాదపూర్వకంగా కూడా తమిళిసై వద్దకు వెళ్లని కేసీఆర్... సోమవారం మాత్రం రాష్ట్రంలో నలుగుతున్న పలు ప్రధాన సమస్యలపై చర్చించేందుకు వెళ్లక తప్పలేదు. సోమవారం మధ్యాహ్నం రాజ్ భవన్ కు వెళ్లిన కేసీఆర్... తమిళిసైతో ఏకంగా రెండున్నర గంటలకు పైగా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఆయన గవర్నర్ తో చర్చలు జరిపినట్లుగా సమాచారం.
ఈ రెండున్నర గంటల భేటీలో తమిళిసైతో కేసీఆర్ ఏం మాట్లాడారన్న వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా ఇప్పటికే తీసుకున్న చర్యలు, కోర్టులో కొనసాగిన విచారణ, రెవెన్యూ శాఖ ప్రక్షాళన దిశగా తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు... తదితర విషయాలపై గవర్నర్ తో కేసీఆర్ మాట్లాడినట్లు సమాచారం. అంతేకాకుండా ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ హోదాలో తమిళిసై కేంద్రానికి ఓ నివేదిక పంపిన నేపథ్యంలో... కేసీఆర్ సదరు అంశాలపై గవర్నర్ కు కూలంకషంగానే వివరించినట్లు సమాచారం. మొత్తంగా గవర్నర్ గా తెలంగాణకు వచ్చిన తమిళిసైని కనీసం స్వాగతం చెప్పేందుకు కూడా సిద్ధపడని కేసీఆర్.... ఇప్పుడు ఏకంగా రెండున్నర గంటల పాటు భేటీ అవడంతో పాటుగా రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై వివరించేందకు వెళ్లడం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.
తమిళిసైకి ముందు గవర్నర్ గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ వద్దకు రెగ్యులర్ గా వెళ్లిన కేసీఆర్... తమిళిసై రాష్ట్రానికి వచ్చి రెండున్నర నెలలు అవుతున్నా కూడా రాజ్ భవన్ ముఖం చూడకుండా ఉండటంపై ఇప్పటికే పెద్ద చర్చే నడుస్తోంది. తనకు తానుగా గవర్నర్ వద్దకు వెళ్లరాదన్న నిర్ణయంతోనే కేసీఆర్ రాజ్ భవన్ ముఖం చూడటం లేదన్న వాదనలు కూడా వినిపించాయి. అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, తనకు ఇబ్బందిగా మారుతున్న పరిణామాలపై కేంద్రానికి గవర్నర్ నివేదికలు పంపుతుండటంతో కేసీఆర్ రాజ్ భవన్ తలుపు తట్టక తప్పలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా... 80 రోజుల తర్వాత అయినా రాజ్ భవన్ కు వెళ్లిన కేసీఆర్ గవర్నర్ తో బేటీ కావడం ఒకింత ఆసక్తి రేకెత్తించే అంశంగానే చెప్పాలి.