మనం మస్తు సర్వేలు చేయించాం. అన్నింట్లోనూ ఒకటే మాట.. మనకు తిరుగులేదని.. ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగినా వంద సీట్లకు తగ్గకుండా గెలుపు ఖాయమంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చేసిన ప్రకటనల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. వంద సీట్లలో గెలుపు పక్కా అన్న ఆయన.. ఇటీవల నిర్వహించిన వరుస సభల్లో కొత్త పల్లవిని వినిపించారు.
టీఆర్ఎస్ పార్టీ గెలిచేది 100 సీట్లల్లో కాదని.. 110 సీట్లలో అంటూ సరికొత్తగా చెప్పారు. వందకే దిక్కులేదు మొర్రో అంటే.. మరో పది సీట్లు పెంచేస్తే ఎలా? అన్న సందేహాన్ని పలువురు టీఆర్ఎస్ నేతలు వర్రీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్ గెలుపు కోసం ధీమాను ప్రదర్శిస్తున్న కేసీఆర్.. వాస్తవంలో మాత్రం అంత కాన్ఫిడెంట్ గా లేరని చెబుతున్నారు.
ముందస్తుకు వెళ్లాలని డిసైడ్ చేసే నాటికి వాతావరణం అంతా టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నట్లు కనిపించినా.. అభ్యర్థుల ఎంపికతో పాటు.. ఎన్నికలకు రెఢీ అన్న తర్వాత వాతావరణం మారింది. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. దీంతో కేసీఆర్ ఆత్మరక్షణలో పడటమేకాదు.. కొత్త కొత్త ప్లాన్లను సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
తాజాగా అలాంటి ప్లాన్ ఒకటి కేసీఆర్ సిద్ధం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఇంటికి.. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులను పార్టీకి చెందిన వారు వ్యక్తిగతంగా కలుసుకొని.. వారికి కేసీఆర్ సర్కారు చేసిన పనుల గురించి చెప్పటం.. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలన్న విషయాన్ని వారి వ్యక్తిగతంగా చెప్పేందుకు వీలుగాఒక ప్లాన్ ను సిద్ధం చేశారు.
దసరా పండగ తర్వాత మొదలయ్యే ఈ కార్యక్రమం కోసం ప్రతి గ్రామానికి 20 నుంచి 30 మంది వరకూ ప్రత్యేక పరిశీలకుల్ని పార్టీ రంగంలోకి దించుతుంది. వారు నియోజకవర్గం మొత్తాన్ని పర్యటించి.. ప్రతి ఇంటికి వెళ్లి.. ప్రతి ఒటరుకూ కారు గుర్తుకు ఓటు వేయాలని చెబుతారు. ఎక్కడైనా.. ఏదైనా సమస్య ఉంటే వాటిని పార్టీ ముఖ్యనేతల దృష్టికి తీసుకొచ్చి.. పరిష్కారాన్ని సూచిస్తారని చెబుతున్నారు. ఇలా ఎన్నికలు జరిగితే.. అలా 110 సీట్లలో గెలిచే దమ్మే ఉంటే.. హడావుడిగా ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నట్లు? అన్న ప్రశ్నను పలువురు వేస్తున్నారు.