కేసీఆర్ త‌న సెంటిమెంట్‌ ను బ‌య‌ట‌పెట్టారు

Update: 2018-05-10 09:54 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌ల్లోని మేజిక్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తాజాగా ఆయ‌న డ్రీం అయిన రైతుబంధు ప‌థ‌కాన్ని ఘ‌నంగా స్టార్ట్ చేశారు. దేశంలో మ‌రెక్క‌డా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని రైతులంద‌రికి.. ఎక‌రాకు రూ.8వేలు చొప్పున ప్ర‌భుత్వం రైతు బంధు ప‌థ‌కాన్ని ఈ రోజు నుంచి షురూ చేస్తున్నారు.ఈ ప‌థ‌కం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ఏటా రూ.12వేల వ‌ర‌కూ ఖ‌ర్చు చేయ‌నుంది.

రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల మ‌న‌సుల్ని దోచుకునేందుకు వీలుగా ఈ భారీ ప‌థ‌కాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెర మీద‌కు తెచ్చార‌ని చెబుతారు.

పంట‌కు ఎక‌రాకు రూ.8వేల చొప్పున అంటే.. అది రైతుల‌కు నేరుగా చేర‌టంతో పాటు.. ప్ర‌భుత్వం ప‌ట్ల పాజిటివ్ అవుతుంద‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ భారీ కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న క‌రీంన‌గ‌ర్ జిల్లాలో షురూ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు.

మంచి జోష్ మీద ఉన్న కేసీఆర్ ఆస‌క్తిక‌ర అంశాన్ని చెప్పారు. త‌న‌కు క‌రీంన‌గ‌ర్ జిల్లా అంటే ప్ర‌త్యేక‌మైన అభిమాన‌మ‌ని.. ఏ ప‌నిని స్టార్ట్ చేసినా జిల్లాలోనే చేస్తాన‌ని చెప్పారు.  అది త‌న సెంటిమెంట్ గా చెప్పారు. 14 ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణ ఉద్య‌మానికి అండ‌గా నిలిచింది క‌రీంన‌గ‌ర్ జిల్లానేన‌ని గుర్తు చేశారు.

తాజాగా విడుద‌లైన సివిల్స్ ఫ‌లితాల్లో జాతీయ స్థాయిలో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచిన అనుదీప్ క‌రీంన‌గ‌ర్ వాసేన‌ని.. తెలంగాణ తెలివి ఏమిటో అనుదీప్ నిరూపించిన‌ట్లుగా చెప్పారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న‌.. చేప‌ట్టిన ప‌లు కార్య‌క్ర‌మాల్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

+  అన్నివర్గాల ప్రజలకు నిరంతర విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే.

+  భూ ప్రక్షాళన చేసిన ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణనే.

+ 20 శాతం సొంత ఆదాయం సాధించిన రాష్ట్రం కూడా తెలంగాణనే.

+ ఇతర రాష్ట్రాలు పది శాతం లోపే ఉన్నాయి.

+ రాష్ట్ర ప్రగతిలో ఉద్యోగులందరూ విశేష కృషి చేస్తున్నారు.

+ హోంగార్డులకు - ఆశావర్కర్లకు - అంగన్‌ వాడీలకు అత్యధిక జీతాలు ఇస్తున్నాం.

+ భారతదేశంలో ఇవాళ పర్వదినం. దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలుస్తోంది.

+ రైతులకు పెట్టుబడి కోసం ప్ర‌స్తుతానికి రూ.1200కోట్లు కేటాయించాం.  

+ రైతులకు పెట్టుబడి సాయం చేసిన గౌరవం తెలంగాణకు దక్కుతుంది. మద్దతు ధర కోసం ఎంపీలు కేంద్రంతో పోరాడతారు.
Tags:    

Similar News