తన కలల ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకు ఏపీకి వచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చిన ఆయన.. నేరుగా తనకు కేటాయించిన హోటల్ కు వెళ్లి ఫ్రెష్ అయ్యారు.
అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆహ్వాన పత్రికను దుర్గమ్మ పాదాల చెంత ఉంచిన కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం తర్వాత ఆయన నేరుగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు.
తన నివాసానికి వచ్చిన కేసీఆర్ కు జగన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు అప్యాయంగా పలుకరించుకున్నారు. తాను దగ్గరుండి మరీ కేసీఆర్ ను లోపలకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరు కావాలని జగన్‌కు ఆహ్వానాన్ని అందించారు.
ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని.. హాజరు కావాలని కోరారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు.. పలువురు ముఖ్యులు కలిసి వారితో భోజనం చేశారు. కేసీఆర్ వెంట కేటీఆర్.. సంతోష్.. వినోద్ కుమార్.. పల్లా రాజేశ్వరెడ్డి తదితరులు ఉన్నారు. భోజనం అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు పలు అంశాల మీద చర్చలు జరుపుతున్నారు.
విభజన చట్టంలో నెలకొన్న ఇబ్బందులతో పాటు.. వాటి పరిష్కారం కోసం ఏమేం చేయాలన్న అంశాలపై చర్చలు జరుపుతున్నారు. ఇరు రాష్ట్రాల మధ్యనున్న విభేదాల్ని పరిష్కరించే దిశగా తాజా భేటీ సాగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.