ఎన్నికల వేళ టిక్కెట్ వస్తుందా రాదా అన్న ఆందోళన ప్రతీ నాయకుడిలో ఉంటుంది. ఆ బాదరబందీలో పార్టీలోకి జంపింగ్ లు సర్వసాధారణంగా మారుతుంటాయి. ఇలాంటివి ముందే ఊహించి కేసీఆర్ ఏకంగా 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. ఇప్పుడా పార్టీలో అసలు ఖాళీలే లేవు. ఇప్పుడు ఒత్తిడంతా కాంగ్రెస్ పైనే..
తాజాగా కాంగ్రెస్ పార్టీని జంప్ జిలానీల ఫీవర్ షేక్ చేస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి టీఆర్ ఎస్ లో చేరి హస్తం పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. ఇంకెంతమంది క్యూలో ఉన్నారనే టెన్షన్ కాంగ్రెస్ కండువాలను షేక్ చేస్తోందట..
తెలంగాణ కాంగ్రెస్ ను ఎన్నికల ఫీవర్ కమ్మేసింది. కేసీఆర్ 105 సీట్లను ప్రకటించేయడంతో ఇప్పుడు ఒత్తిడి అంతా కాంగ్రెస్ మీద పడింది. ఎవరికి టికెట్ ఇస్తే ఏం జరుగుతుంది.? అసమ్మతి చెలరేగుతుంతా.. పార్టీ చీలుతుందా అన్న భయం కాంగ్రెస్ కండువాలను షేక్ చేస్తోందట.. ఒక్కో సీటుపై ఇద్దరు ముగ్గురున్న చోట టికెట్ దక్కకపోతే వేరే పార్టీల్లోకి జంప్ చేసి కాంగ్రెస్ ను ఓడిస్తారేమోనన్న భయం వెంటాడుతోందట..
టిక్కెట్ దక్కదని తెలిసినా కాంగ్రెస్ నేత సురేష్ రెడ్డి టీఆర్ ఎస్ లో చేరడం కాంగ్రెస్ నేతలను కృంగదీసింది. ఎందుకంటే కేసీఆర్ 105మంది పేర్లను ప్రకటించేశారు. ఇప్పుడు టీఆర్ ఎస్ లో చేరినా ఆ పార్టీ నుంచి పోటీచేసే అవకాశం లేదు. అయినా కాంగ్రెస్ నేత చేరడం ఆ పార్టీకి శరాఘాతంగా మారింది. మరో నలుగురు - ఐదుగురు నేతలు కూడా పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారన్న వార్త కాంగ్రెస్ ను షేక్ చేస్తోంది.
టీఆర్ ఎస్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు ఓవైపు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్ సీనియర్లు చేజారిపోవడం పార్టీని మానసికంగా దెబ్బతీస్తోంది. ఇలా అయితే టీఆర్ ఎస్ ను ఎదుర్కోవడం కష్టమని.. పార్టీ నేతలను ఎలా కాపాడుకోవాలో తెలియక కాంగ్రెస్ నేతలు మథనపడుతున్నారట..