తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ ఫార్ములాతో ప్రధనా ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. టీఆర్ ఎస్ సర్కారు బీసీలను లక్ష్యంగా చేసుకుని పలు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో... 2019 ఎన్నికలకు ముందు బీసీలను పార్టీకి దగ్గరగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా అన్ని సామాజిక తరగతులను పార్టీకి దగ్గరగా చేయాలని భావిస్తోంది. ప్రధానంగా పార్టీకి దూరమైన బీసీ సామాజిక తరగతిని దగ్గర చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలో బీసీల నుంచి ఒకరిని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని అధిష్టానం యోచిస్తున్నట్టు తెలిసింది.
రాజకీయ పునరేకీకరణ పేరిట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక శక్తులను ఐక్యం చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. తాజాగా అన్ని సామాజిక తరగతులను దగ్గరకు చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో తెలంగాణలో 2019 అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. అందులో భాగంగా తెలంగాణలో మరో వర్కింగ్ ప్రెసిడెంట్ ను నియమించాలని భావిస్తోంది. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని అధ్యక్షునిగా నియమించింది. ఎస్సీల నుంచి భట్టీ విక్రమార్కను వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో బీసీలకు పార్టీలో పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో పావులు కదుపుతోంది. గతంలో టీడీపీ నేత రేవంత్ రెడ్డి పార్టీలో చేరినప్పుడే.. ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఇప్పటికే రెడ్డి సామాజిక తరగతి మద్దతు పార్టీకి బలంగా ఉందని భావిస్తున్న పార్టీ హైకమాండ్.. బీసీలను దగ్గర చేసుకునే వ్యూహాలకు పదునుపెట్టింది.
బీసీలోని అన్ని కులాలను ఐక్యం చేసి సఖ్యతతో ముందుకు తీసుకెళ్లే చాతుర్యం ఉన్న నాయకుడి కోసం అన్వేషిస్తోంది. పార్టీ రథసారథి రాహుల్ గాంధీ త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సమయంలో పలువురిని పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరును ప్రకటించాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. ఈ పోటీలో ప్రధానంగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తో పాటు దానం నాగేందర్ - సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఒకవేళ పొన్నం లేదా దానం నాగేందర్ లో ఒకరిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తే అంజన్ కుమార్ యాదవ్ ను హైదరాబాద్ సిటీ అధ్యక్షునిగా నియమించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు ఢిల్లీలో రాష్ట్ర నేతలు సైతం మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది.