తెలంగాణ సీఎస్ అలిగారా..? ఏంజ‌రిగింది...?

Update: 2019-08-13 15:29 GMT
సీఎస్‌. రెండు అక్ష‌రాలే ఉన్న‌ప్ప‌టికీ.. ఈ అధికారికి రాష్ట్రం మొత్తం మీద కూడా స‌ర్వాధికారాలు ఉంటాయి. ప్ర‌జ‌లు ఎన్నుకొన్న సీఎం త‌ర్వాత పాల‌న వ్య‌వ‌హారాల్లో సీఎం రేంజ్‌ లోనే సీఎస్ కూడా నిర్ణ‌యాలు తీసు కుంటారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉండే అధికారికి అటు రెవెన్యూ - ఇటు పోలీస్ స‌హా అన్ని వ‌ర్గాలు కూడా స‌లా చేయాల్సిందే. సీఎం రాష్ట్రంలో ఉన్నా.. లేకున్నా కూడా పాల‌న వ్య‌వ‌హారం అంతా కూడా సీఎస్‌ కు తెలియ‌కుండా జ‌ర‌గ‌దంటే అతిశ‌యోక్తికాదు. అలాంటి సీఎస్ ఇప్పుడు తెలంగాణ‌లో అలిగార‌ని ప్ర‌ధాన మీడియాలో వార్త‌లు హ‌ల్‌ చ‌ల్ చేస్తున్నాయి.

విష‌యంలోకి వెళ్తే.. తెలంగాణ సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణ‌యాలు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే పాత స‌చివాల‌యాన్ని తీసివేసి..బూర్గుల రామ‌కృష్ణారావు భ‌వ‌న్‌ లో కొత్త స‌చివాల‌యం ఏర్పాటు చేసుకుంటున్నారు (అంటే తాత్కాలికంగా). త్వ‌ర‌లోనే కొత్త‌ది నిర్మించాల‌ని శంకుస్తాప‌న కూడా చేశారు. అయితే, ఇప్ప‌టి వ‌రకు ఉన్న ఉమ్మడి ఏపీ స‌చివాల‌యం వాస్తు బాగోలేద‌ని అంటూ.. కేసీఆర్ కొత్త‌ది క‌ట్టే వ‌ర‌కు కూడా దాని మొహం కూడా చూడ‌న‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే హుటాహుటీన కార్యాల‌యాలను త‌ర‌లించాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు.

ఈ నేప‌థ్యంలో కొంత ఆల‌స్య‌మ‌వుతోంది. అయితే, దీనికి సీఎస్ జోషి.. చురుగ్గా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని కొంద‌రు మంత్రులు కేసీఆర్ చెవిలో ఊదారు. దీంతో ఆయ‌న తాజాగా అధికారుల స‌మీక్ష‌లో ఈ విష‌యంప్ర‌స్తావించిన సీఎం కేసీఆర్‌.. సీనియ‌ర్ అధికారులే పెద్ద‌గా చ‌లించ‌డం లేదు! అని వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది. ఈ విష‌యంలో ప్ర‌ధాన మీడియాలో రావ‌డంతో ఆ వెంట‌నే సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ ప‌రిణామంతో జోషి అలిగార‌ని అంటున్నారు. తాను ఇక పాత భ‌వ‌నం  వంక క‌న్నెత్తి కూడా చూడ‌బోన‌ని ఆయ‌న ఖ‌రాఖండీగా చెప్పిన‌ట్టు తెలిసింది. మ‌రి ఇది ఏ ర‌గ‌డ‌కు దారితీస్తుందో ? చూడాలి.


Tags:    

Similar News