పాలనను మరింత వేగంతో పరుగులు తీయించటంతో పాటు.. అభివృద్ధికి అనుమతులకు ఉన్న లింకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వృద్ధి రేటుకు అనుమతులు అడ్డు పడుతుంటాయి. అయితే.. అలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు వీలుగా.. జెట్ స్పీడ్ తో అనుమతులు ఇచ్చేందుకు వీలుగా కార్యాచరణను సిద్ధం చేసింది తెలంగాణ సర్కారు.
సులభతర వాణిజ్య నిర్వహణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 34 శాఖల పరిధిలోని 58 రకాల సేవల్ని స్పీడ్ గా అందించాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు డిసైడ్ చేసింది. ఆన్ లైన్ తో వీటి నిర్వహణకు విధివిధానాల్ని విడుదల చేసింది.
సులభతర వాణిజ్య నిర్వహణలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రధమ స్థానంలో ఉన్న విషయం విదితమే. కేంద్ర ప్రభుత్వం.. ప్రపంచ బ్యాంకు అధ్వర్యంలో జరిగే ఎంపికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. పారిశ్రామిక అనుమతులు.. స్వీయధ్రువీకరణ విధానాల్ని అనుసంధానం చేయటం.. అనుమతులు.. నమోదు అన్ని రకాల సేవలకు నిర్దిష్ట గడువును డిసైడ్ చేసింది.
తాజాగా తీసుకున్న మార్పులతో అనుమతుల చట్రం నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉందని చెప్పాలి. అనుమతులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆయా శాఖల్ని ఆదేశించింది.
తాజాగా తీసుకున్ననిర్ణయం ప్రకారం..
1 రోజులో: వాణిజ్య పన్నులు.. ఆబ్కారీ శాఖలో వృత్తి పన్ను నమోదు.. రెవెన్యూ శాఖలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్
2 రోజుల్లో: పురపాలక శాఖలో భవన నిర్మాణ ప్రణాళిక ఆమోదానికి చేపట్టే తనిఖీ నివేదికల నమోదు
2 రోజుల్లో: భవనాల స్వాధీన ధ్రువ పత్రం కోసం చేసే తనిఖీలు
2 రోజుల్లో: పౌర సరఫరాల శాఖలో ఉత్పత్తిదారు.. డీలర్ నమోదుకు చేసే తనిఖీ నివేదిక నమోదు
3 రోజుల్లో: కార్మిక శాఖలో కర్మాగారాల పునరుద్ధరణ.. సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద సంఘాల నమోదు
7 రోజుల్లో: పారిశ్రామిక రాయితీలకు అకనాలెడ్జ్ మెంటు జారీ
7 రోజుల్లో: కాలుష్య నియంత్రణ మండలిలో హరిత పరిశ్రమల నిర్వహణ పునరుద్ధరణ
7 రోజుల్లో: కర్మాగారాల శాఖలో బాయిలర్ల అనుమతులు పునరుద్ధరణ
7 రోజుల్లో: కరెంటు కనెక్షన్ల కోసం రోడ్డు తవ్వకాలకు అనుమతి
7 రోజుల్లో: భవన నిర్వాహణ తనిఖీల నివేదిక నమోదు
14 రోజుల్లో: ఔషధాల ఉత్పత్తి అనుమతి పునరుద్ధరణ
14 రోజుల్లో: టోకు లైసెన్స్.. చిల్లర ఔషధ వ్యాపారాలకు అనుమతి జారీ.. ఎలక్ట్రికల్ వ్యవస్థ ఏర్పాటు
15 రోజుల్లో: వ‌్యాపార అనుమతి.. భవన నిర్మాణ కార్మికుల నమోదు
15 రోజుల్లో: తూనికలు కొలతల చట్టం కింద నమోదు.. పునరుద్ధరణ
15రోజుల్లో: ఆస్తుల మ్యూటేషన్.. ఆస్తిపన్ను అంచనా.. పారిశ్రామిక రాయితీ లపై ఎల్ వోసీల జారీ
21 రోజుల్లో: బాయిలర్ల ఉత్పత్తిదారులకు అనుమతులు
21 రోజుల్లో: ఆరెంజ్ కేటగిరి పరిశ్రమల పునరుద్ధరణ
30 రోజుల్లో: ఒప్పంద కార్మిక చట్టం కింద యాజమాన్య సంస్థ నమోదు
30 రోజుల్లో: వలస కార్మికుల చట్టం కింద నమోదు
30 రోజుల్లో: దుకాణాలు.. వాణిజ్య సంస్థల కింద నమోదు.. అంతర్ రాష్ట్ర కార్మికుల నమోదు
30 రోజుల్లో: రెడ్ కేటగిరి పరిశ్రమల పునరుద్దరణ.. పారిశ్రామిక రాయితీల మంజూరు పత్రం జారీ