తెలంగాణలో కొత్త జిల్లాలు అధికారుల మధ్య అనారోగ్యకర పోటీ, అసూయలకు దారి తీస్తున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడబోతున్న సమయంలో రెవెన్యూ సిబ్బంది - గ్రూప్ వన్ ఆఫీసర్ల (రెవెన్యూ మినహా ఇతర శాఖలు) మధ్య జాయింట్ కలెక్టర్ ‘హోదా’ కోసం అంతర్గత యుద్ధం ప్రారంభమైంది. కొత్త జిల్లాల్లో ప్రతి జిల్లాకు కలెక్టర్ తోపాటు జాయింట్ కలెక్టర్ ను నియమించాల్సి ఉంటుంది. కలెక్టర్ పోస్టులో ఐఏఎస్ అధికారినే నియమిస్తారు.
కాగా కొత్తగా నియామకమయ్యే ఐఏఎస్ అధికారి ఐదేళ్లపాటు సబ్-కలెక్టర్ గా - జాయింట్ కలెక్టర్ గా ఇతర సమానహోదా కలిగిన పోస్టుల్లో పనిచేసిన తర్వాత కలెక్టర్ గా నియమిస్తూ వస్తున్నారు. జాయింట్ కలెక్టర్ పోస్టులో కూడా ఐఏఎస్ అధికారినే నియమిస్తూ వస్తున్నారు. ఈ పోస్టులో డైరెక్ట్ ఐఏఎస్ అధికారి లేనిపక్షంలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న సీనియర్ అధికారులకు ప్రమోషన్ ఇచ్చి జెసిగా నియమిస్తున్నారు. ఇందులో రెండు రకాలున్నాయి. గ్రూప్-1 లేదా గ్రూప్-2 పోస్టుల్లో నియమితులై రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న వారు, ఇతర శాఖలకు అలాట్ అయినవారు ఉన్నారు. గ్రూప్-1లో నియామకమై రెవెన్యూ అధికారులు ఆర్డీవోగా - డిఆర్ ఓలుగా పనిచేసి కన్ ఫర్డ్ ఐఏఎస్ గా ప్రమోషన్ పొంది జాయింట్ కలెక్టర్ పోస్టులో నియామకమవుతారు. కొన్ని సందర్భాల్లో వీరికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా ప్రమోషన్ ఇస్తూ - జెసిగా నియమిస్తున్నారు. రెవెన్యూ ప్రమోషన్లలో 85శాతం స్థానాలు వీరికే రిజర్వ్ చేస్తున్నారు. మరో 15 శాతం ఖాళీల్లో ఇతర శాఖల్లో పనిచేసే గ్రూప్-1 అధికారులకు ప్రమోషన్ ఇచ్చి నియమిస్తున్నారు. వీరుకాకుండా గ్రూప్-2 క్యాడర్ లో నియమితులై రెవెన్యూ శాఖలో చేరే వారు తొలుత డిప్యూటీ తహశీల్దారులుగా నియామకమవుతారు. వీరికీ తహశీల్దార్లుగా - ఆర్డీవోలు - డిఆర్ వోలుగా పదోన్నతులిస్తున్నారు. గ్రూప్ 2లో నియామకమైన రెవెన్యూ అధికారులు జెసి స్థాయి వరకు పదోన్నతులు పొంది వెళ్తున్నారు. ఆర్ డిఓ - డిఆర్ ఓ - జెసిస్థాయి వరకు రెవెన్యూ వారికి 85శాతం రిజర్వేషన్ ఉండటంతో ప్రమోషన్లు త్వరగా వస్తున్నాయి. ఇతరులకు కేవలం 15 శాతం మాత్రమే రిజర్వేషన్ ఉంది. ఈ అంశాన్ని ఇటీవల గ్రూప్-1 ఆఫీసర్స్ (రెవెన్యూ మినహా) ఒక ఉద్యమంగా మార్చింది. రెవెన్యూ పోస్టుల్లో ప్రత్యేకంగా జెసి పోస్టులకు ప్రమోషన్లు ఇచ్చేసమయంలో 85:15 శాతం తొలిగించి గ్రూప్-1 క్యాడర్ లో ఉండే అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సిఎం కె. చంద్రశేఖరరావు - సిఎస్ రాజీవ్ శర్మతోపాటు భూపరిపాలన ప్రధాన కమిషనర్ - రెవెన్యూ ముఖ్యకార్యదర్శి తదితరులకు లేఖలు ఇచ్చారు. 20-25 ఏళ్లు పనిచేసే ఇతర శాఖల గ్రూప్-1 అధికారులకు జెసిలుగా అవకాశం రావడం లేదని, అదే సమయంలో గ్రూప్-2లో నియమాకం అయ్యే డిప్యూటీ తహశీల్దారులు కూడా జెసిలుగా ప్రమోషన్ పై నియామకం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ గ్రూప్-1 అధికారుల సంఘం కోరుతోంది.
మరోవైపు జెసిలుగా రెవెన్యూ సిబ్బందినే నియమించాలంటూ రెవెన్యూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రమోషన్ విధానాన్నే అనుసరించాలని (85:15) తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం పట్టుపడుతోంది. ప్రోటోకాల్ - శాంతిభద్రతలు - భూతగాదాలు తదితర అంశాల్లో రెవెన్యూ సిబ్బంది నిష్ణాతులుగా ఉంటారని, మెజిస్టీరియల్ అధికారాలు కూడా కలిగి ఉంటారని, అవసరమైన పక్షంలో మెజిస్టీరియల్ విచారణ జరుపుతారని వారు వాదిస్తున్నారు. వాస్తవంగా జెసి పోస్టు రెవెన్యూ శాఖకు సంబంధించిందేనని, ఈ పోస్టును కలెక్టర్ (రెవెన్యూ) అని కూడా పిలుస్తున్నారని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కానీ రెవెన్యూ - గ్రూప్ 1ఉద్యోగులు మాత్రం కొత్త హోదాల కోసం కొట్లాడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/