తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం..సెలవుల్ని రద్దు చేసుకుంది

Update: 2020-04-30 03:04 GMT
సాధారణంగా కోర్టులు వేసవి కాలంలో పని చేయవు. వేసవి సెలవులు తీసుకుంటాయి. అయితే.. అత్యవసర కేసుల విచారణ కోసం పరిమితంగా కోర్టు పని చేస్తుంటాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అదేమంటే.. తెలంగాణ రాష్ట్రంలో న్యాయస్థానాలకు వేసవి సెలవుల్ని రద్దు చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ఆదేశాల్ని తాజాగా జారీ చేసింది.

రోటీన్ లో భాగంగా తెలంగాణ హైకోర్టు జారీ చేసిన క్యాలెండర్ ప్రకారం మే నాలుగు నుంచి జూన్ ఐదో తేదీ వరకూ తెలంగాణలోని కోర్టులకు వేసవి సెలవులుగా పేర్కొంది. అయితే.. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా కోర్టులు ఏమీ పని చేయని పరిస్థితి. దీంతో.. ఈ వేసవిలో ఉండే ఎండాకాలం సెలవుల్ని రద్దు చేయాలని హైకోర్టు ఫుల్ బెంచ్ నిర్ణయం తీసుకుంది.

దీంతో తెలంగాణ హైకోర్టుతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కింది కోర్టులు.. ట్రైబ్యునళ్లు.. తెలంగాణ లీగల్ సర్వీస్ అధారిటీ.. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ.. తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమి.. మీడియేన్.. అర్బట్రేషన్ సెంటర్లకు సైతం ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది. తాజా నిర్ణయంతో.. లాక్ డౌన్ సెలవుల కారణంగా కేసుల విచారణ నిలిచి పోయిన నేపథ్యంలో.. దాన్ని వేసవి సెలవుల్ని ఎత్తేయటం ద్వారా కవర్ చేయనున్నారు.
Tags:    

Similar News