ముక్కుసూటితనం.. నిజాయితీతో పాటు.. తనకు అప్పగించిన పనిని తనదైన శైలిలో పూర్తి చేసే యువ ఐఏఎస్ అధికారుల్లో స్మిత సబర్వాల్ ఒకరు. తనకు బాధ్యతలు అప్పగించిన జిల్లాల్లో తనదైన శైలిలో పని చేయటం కారణంతో మంచి పేరు తెచ్చుకున్న స్మిత సబర్వాల్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేషీలో పని చేసే అవకాశం లభించింది.
కరీంనగర్ కలెక్టర్‌గా ఆమె పని చేసిన తీరును గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తన పేషీలో పని చేయాలని కోరారు. దీంతో.. జూనియర్ అధికారిణిగా ఉన్న ఆమెకు సీఎంవో పని చేసే అద్భుతమైన అవకాశం లభించింది.
తాజాగా ఆమెపై అవుట్‌లుక్ వారపత్రిక ప్రచురించిన కథనంపై స్మిత సబర్వాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను కించపరిచేలా.. ఆమె వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బ తినేలా సదరుకథనం ఉందన్నది ఆమె వాదన.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె ఉద్యమకారులకు సహకరించారని సదరు పత్రిక ఆరోపించింది. ఈ కారణంతోనే జూనియర్ అధికారిణి అయినప్పటికీ ఆమెకు సీఎంవోలో పని చేసే అవకాశం లభించిందంటూ సదరు పత్రిక తన కథనంలో ఆరోపించింది. దీనిపై ఆగ్రహం చేసిన ఆమె ఐదు పేజీల లీగల్ నోటీసును జారీ చేశారు. తన పరువుకు భంగం వాటిల్లిందని ఆమె తానిచ్చిన లీగల్ కేసులో పేర్కొన్నారు.