తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్య ధోరణి కారణంగా 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డట్టు విద్యార్థులు - వారి తల్లిదండ్రులు - ప్రజా సంఘాలు - రాజకీయ పార్టీలన్నీ ఒక్కుమ్మడిగా చెబుతుంటే... అసలు విద్యార్థుల ఆత్మహత్యలకు - ఇంటర్ బోర్డుకు ఎలాంటి సంబంధమే లేదని అంటున్నారు బోర్డు కార్యదర్శి అశోక్. నిజమేనా? అంటే... స్వయంగా ఆయనే మీడియా ముందుకు వచ్చి మరీ ప్రకటన చేస్తే నిజమని నమ్మక తప్పుతుందా? ఇంటర్ బోర్డు నిర్లక్ష్య వైఖరిపై బోర్డు కార్యాలయం ముందు రోజుల తరబడి ధర్నాలు జరిగితే... ఎంచక్కా కోటేసుకుని వెనుక గేటు ద్వారా కార్యాలయానికి వచ్చిపోయిన అశోక్ అడ్డంగా మీడియా కంటికి చిక్కిపోయారు కదా. అంతకుముందు వాల్యూయేషన్ లో తప్పులు దొర్లిన మాట వాస్తవమేనని కూడా స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు. అది కూడా మీడియా సాక్షిగానే.
మరి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డ తర్వాత... ఇప్పుడు ఇంటర్ బోర్డు తప్పిదం లేదని చెబుతున్నది కూడా అదే అశోక్. అసలు ఇంటర్ బోర్డు తప్పులు చేసిందని ఒక్కచోట కూడా తేలలేదని చెప్పిన ఆయన రీ వాల్యూయేషన్ - రీ కౌంటింగ్ లలో ఒక్క పొరపాటు కూడా పట్టుబడలేదని తేల్చేశారు. అంతేనా... అసలు తాము విడుల చేసిన ఇంటర్ రిజల్ట్స్ కు విద్యార్థుల ఆత్మహత్యలకు ఎలాంటి సంబంధం కూడా లేదని కూడా ఆయన తేల్చేశారు. అందుకు ఆయన సుదీర్ఘ వివరణ కూడా ఇచ్చారు. ఆత్మహత్యలు చేసుకున్న వారితో పాటు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వారి సంఖ్యను 53గా తేల్చిన అశోక్... వీరి జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ - రీ2 కౌంటింగ్ లో ఎలాంటి తప్పిదం కూడా కనబడలేదట. ఫలితాల ప్రకటన కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు చెప్తున్నా - ఆ విద్యార్థులు జవాబు పత్రాలు రీ-వెరిఫికేషన్ లో కానీ రీ-కౌంటింగ్ లో కానీ ఎలాంటి తప్పిదం బయటపడలేదని చెప్పారు.
గ్లోబరీనాతో పాటు టెక్ మెథడక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు వేర్వేరుగా 12 కేంద్రాల్లో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబుపత్రాలను దిద్దినట్టు అశోక్ చెప్పారు. ఈ రెండు సంస్థలు నిర్వహించిన రీ-వెరిఫికేషన్..రీ-కౌంటింగ్ లో ఫలితాలు ఒకేలా ఉన్నాయని వివరించారు. ఆత్మహత్యకు పాల్పడిన 23మంది విద్యార్థుల్లో 10మంది విద్యార్థులు ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ కాగా 12 మంది విద్యార్థులు ఒకటికి మించిన సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారని చెప్పారు.85శాతం మార్కులు వచ్చినా ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని అశోక్ చెప్పారు. ముగ్గురు విద్యార్థులు పాస్ అయినా ఆత్మహత్యకు పాల్పడినట్టు బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. మొత్తంగా విద్యార్థుల ఆత్మహత్యలకు బోర్డు తరఫున జరిగిన పొరపాట్లకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అసలు బోర్డు తప్పిదాలే చేయలేదని కూడా ఆయన తనదైన శైలి వాదన వినిపించారు.
ఇదంతా మీడియా అతి కారణంగానే ఇంత రాద్ధాంతం చోటుచేసుకుందని చెప్పిన అశోక్... మొత్తం పాపమంతా మీడియాదేనని ఓ అభాండం వేసేశారు. మరి వివాదం రేకెత్తకముందు... వాల్యూయేషన్ లో తప్పులు జరిగిన మాట వాస్తవమేనని నాడు చేసిన ప్రకటనపై అశోక్ ఏమంటారో చూడాలి. అంతేకాకుండా మొత్తం వివాదానికే కేంద్ర బిందువుగా మారిన గ్లోబరీనా సంస్థతోనే రీ వెరిఫికేషన్ - రీ కౌంటింగ్ ఎలా చేయిస్తారన్న విషయంపైనా అశోక్ ఎలా మాట్లాడతారో చూడాలి. తప్పులు చేసిన సంస్థలతోనే రీ వెరిఫికేషన్ చేస్తే... ఆ తప్పులు ఎలా బయటపడతాయన్నది ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మిగిలింది. మొత్తంగా ఇప్పుడిప్పుడే చల్లబడుతుందని భావిస్తున్న ఇంటర్ బోర్డు వివాదం... అశోక్ వ్యాఖ్యలతో మరోమారు అగ్ని గుండంలా మారే ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.