వామ్మో.. బ్లడ్‌బ్యాంకుల్లో ఇన్ని అక్రమాలా?

Update: 2015-07-07 17:27 GMT
మరో అక్రమాల పుట్ట బయటకు వచ్చింది. రాజకీయ కోణమో.. మరొకటో కానీ హైదరాబాద్‌లో ఉన్న అన్ని బ్లడ్‌బ్యాంకుల పైనా అధికారులు దాడులు చేశారు. అధికారులు తినిఖీలు నిర్వహించిన బ్లడ్‌బ్యాంకుల్లో.. చిరంజీవి.. ఎన్టీఆర్‌ బ్లడ్‌బ్యాంకులతో పాటు దాదాపు 120 వరకుఉన్నాయి.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అన్ని బ్లడ్‌ బ్యాంకుల్లోనూ అక్రమాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించటంతో పాటు.. ఎలాంటి అనుమతులు లేకుండా బ్లడ్‌బ్యాంకులు నడుపుతున్నట్లు గుర్తించారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉన్న బ్లడ్‌ బ్యాంకుల్లోనూ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని గుర్తించారు. మొత్తానికి ఈ ఉదంతం సంచలనం సృష్టిస్తోంది.

Tags:    

Similar News