తెలంగాణలో ఇప్పుడు ఆసక్తికరంగా జరుగుతున్న చర్చ ప్రత్యేక రాష్ట్రం యాగాల వల్ల వచ్చిందా? త్యాగాల వల్ల వచ్చిందా అని. తెలంగాణ త్యాగాల వల్ల వచ్చిందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. కానీ యాగాల వల్ల వచ్చిందని కేసీఆర్ చెబుతున్నారు. ఇందుకు కారణం ఏమిటనే దానిని కూడా తెలంగాణవాదులు సరికొత్తగా విశ్లేషిస్తున్నారు.
తెలంగాణ కోసం కాంగ్రెస్ - టీడీపీ - బీజేపీ - సీపీఐ పార్టీలతోపాటు ఉద్యోగులు - విద్యార్థులు - ప్రజా సంఘాలు - జర్నలిస్టులు తదితరులంతా ఒక్కుమ్మడిగా పోరాడిన విషయం తెలిసిందే. సకల జనుల సమ్మెలు - మిలియన్ మార్చిలు తదితరాలు విజయవంతం కావడం వెనక వీరి కృషి ఎంతో చెప్పలేం. ఈ క్రమంలోనే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ త్యాగాల మీదే తెలంగాణ వచ్చిందని ఆయా వర్గాలు పదే పదే చెబుతున్నాయి.
అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత అదంతా తన ఒక్కడి క్రెడిటేనని నిరూపించుకోవడానికి కేసీఆర్ శతథా ప్రయత్నిస్తున్నారు. కోదండరాం తదితరులను పక్కన పెట్టడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని కూడా తెలంగాణలో నిర్వీర్యం చేయాలని భావిస్తున్నారు. సోనియా గాంధీ మినహా ఆ పార్టీలో ఏ ఒక్కిరినీ కేసీఆర్ లెక్క చేయడం లేదు. నాలుగు రోజులుపోతే సోనియా కూడా వారి పరిస్థితే పడుతుందనడంలో సందేహం లేదు. ఏతావాతా ఏడాదిన్నర కాలంలో కేవలం తన నిరాహార దీక్ష - తన ఉద్యమం కారణంగానే తెలంగాణ వచ్చిందని ఆయన పదే పదే నిరూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, త్యాగాలను కూడా మరుగునపడేసి, కేవలం తాను చేసిన యాగం వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చెబుతున్నారని తెలంగాణవాదులు ఇప్పుడు మండిపడుతున్నారు. తన యాగం, తన దీక్ష, తన సంకల్పం వల్లనే తెలంగాణ వచ్చిందని, మిగిలిన వారి కృషి నామమాత్రమని నిరూపించడమే కేసీఆర్ ధ్యేయమని, యాగం సందర్భంగా ఆయన వ్యాఖ్యలు దీనినే నిరూపిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.