రైతుల ఆత్మహత్యలు ఏటేటా పెరిగిపోతున్న క్రమంలో మరో బాధాకరమైన వార్త ఇది. అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది. ఈ లెక్కలను తాజాగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్బీ)వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 8,007 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడగా అందులో 7,566 మంది పురుషులు - 441 మంది మహిళలు ఉన్నారు.
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో సర్వే-2015 ప్రకారం తెలంగాణలో 1,358 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా... ఏపీలో 516 మంది బలవన్మరణం పాలయ్యారు. 2014లో ఈ సంఖ్య 898-160గా నమోదు అయింది. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు రెట్టింపు రైతులు తమ తుది శ్వాస వదిలినట్లు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం మహారాష్ట్రలో అత్యధికంగా 3030 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్ణాటక మూడో స్థానంలో- చత్తీస్ ఘడ్ నాలుగో స్థానంలో మధ్యప్రదేశ్ ఐదో స్థానంలో ఉన్నాయని ఎన్ సీఆర్బీ తెలిపింది. కర్ణాటకలో 1197 మంది అన్నదాతలు - చత్తీస్ ఘడ్ లో 854 మంది - మధ్యప్రదేశ్ లో 581మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో సర్వే ప్రకారం మెజార్టీ రైతుల ఆత్మహత్యలు అప్పుల భారం - వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యల వల్లే తమ ప్రాణాలు వదిలారు. మహారాష్ట్ర27 మంది - తెలంగాణలో 20 - ఆంధ్రప్రదేశ్ లో 13 మంది రైతులు పేదరికం కారణంగా తమ జీవితాన్ని ముగించుకున్నారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న 1358 రైతుల్లో 160 మంది అనారోగ్యం కారణంగా మరణించారు. కాగా దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న మొత్తం పెద్ద రైతుల సంఖ్య 160 ఉండగా.. అందులో 79 మంది తెలంగాణ వారు కాగా చత్తీస్ ఘడ్ వాసులు 37 మంది ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/