పేరుకు తెలుగు ప్రజలే అయినా..తెలంగాణ.. ఆంధ్రాకు చెందిన ప్రజల తీరు భిన్నంగా ఉంటుందని చెప్పక తప్పదు. రాజకీయ తీర్పును ఇవ్వాల్సిన వేళలో వారు ఆలోచించే విధానం ఒకరికొకరికి ఏ మాత్రం పొంతన ఉండదు. ఏపీ ప్రజల్లో చాలా తక్కువగా కనిపించేది.. తెలంగాణ ప్రజల్లో కొట్టొచ్చినట్లు కనిపించే లక్షణం ఒకటి ఉంటుంది. దేనినైనా క్షమిస్తారేమో కానీ..పాలకుల్లో అహంభావాన్ని.. అహంకారాన్ని కానీ అస్సలు ఇష్టపడరు. ఎంతటి వాడినైనా సరే.. అహంకారంతో మాటలు ఉంటే.. వారికి కర్ర కాల్చి వాత పెట్టేలా తీర్పు ఇవ్వటానికి వెనుకాడరు.
తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా.. ఎవరూ సాటిరానట్లుగా ఉండే కేసీఆర్ కు సైతం షాకిచ్చేందుకు సై అనటం తెలంగాణ ప్రజలకు మాత్రమే చెల్లుతుంది. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గులాబీ బాస్ కేసీఆర్ కుమార్తెను ఎంపీ ఎన్నికల్లో ఓడించటం దేనికి నిదర్శనం. ఆ ఎన్నికలకు కేవలం ఆర్నెల్ల ముందే.. బంపర్ మెజార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసిన వైనాన్ని మర్చిపోకూడదు.
ఇదంతా ఎందుకంటే.. తెలంగాణ ప్రజలు తమ పాలకుల్లో వినయాన్ని కోరుకుంటారే తప్పించి.. అహంభావాన్ని అస్సలు ఇష్టపడరు. తాజాగా.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాల్ని ప్రస్తావించారు. వాటి సంగతి ఎలా ఉన్నా.. ఈటలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య ఒకటి భారీ డ్యామేజ్ చేసే అవకాశం ఉందంటున్నారు. నాగార్జునసాగర్ లో సీనియర్ నేత జానారెడ్డినే ఓడించామని.. అలాంటిది ఈటల తమకో లెక్క కాదన్న మాట రావటం ఖరీదైన తప్పుగా అభివర్ణిస్తున్నారు.
ఇంతకాలం హుజూరాబాద్ ఉప ఎన్నిక మీదా.. మంత్రి ఈటల మీదా ఒక మాట అనటానికి ఇష్టపడని కేటీఆర్.. ఏ మూడ్ లో ఉన్నారో కానీ.. ఇప్పటివరకు నియంత్రించుకు వచ్చిన సంయమనాన్ని తాజాగా మిస్ చేసుకున్నట్లుగా చెప్పక తప్పదు. మంత్రి కేటీఆర్ వర్సెస్ ఈటలకు ఉన్న రచ్చ బయటకు తెలియనిది కాదు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేద్దామన్న కేసీఆర్ ఆలోచనలు ముందుకు వెళ్లకుండా చేయటంలో ఈటల కీలక పాత్ర పోషించారని.. అభ్యంతరం వ్యక్తం చేశారని.. అదే ఈటల మీద కేసీఆర్ కత్తి కట్టటానికి కారణమైనందన్న వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తూ ఉంటుంది.
నిజానికి ఈటలకు మంత్రి పదవి ఇవ్వకుండా ఉన్న వేళలోనూ.. మంత్రి కేటీఆర్ చేసిన ఒత్తిడితోనే కేసీఆర్ ఆయన్ను హోల్డ్ పెట్టారన్న వాదన వినిపించింది. అయితే.. ఈటలకు మంత్రివర్గంలో చోటు లభించటంతో కేటీఆర్ మీద వచ్చిన ఆరోపణలు పటాపంచలయ్యాయి. అయినప్పటికీ కేటీఆర్ కు ఈటలకు మధ్య రిలేషన్ అంత బాగుండేది కాదన్న మాట టీఆర్ఎస్ వర్గాలే చెబుతుంటాయి.
ఈటలను ఎవరు తక్కువగా చేసి మాట్లాడినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ.. మంత్రి కేటీఆర్ నోటి నుంచి మాత్రం అలాంటి మాటలు రాకూడదు. ఈటలతో పోల్చినప్పుడు కేటీఆర్ పెద్ద ఉద్యమకారుడు కాదు.. సీనియర్ నేత కూడా కాదు. పార్టీ కోసం కష్టపడింది లేదు. ప్రతికూల వాతావరణంలో పార్టీకి అండగా నిలిచింది లేదు. అలాంటి నేతను సింఫుల్ గా తీసిపారేసినట్లుగా ఉండే కేటీఆర్ మాటలు.. ఆయనలోని ఆత్మవిశ్వాసం కంటే కూడా అహంభావమే కనిపించేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. జానారెడ్డినే ఓడించాం.. ఈటల మాకో లెక్క కాదన్న కేటీఆర్ మాటకు ఆయన రానున్న రోజుల్లో చింతించాల్సి ఉంటుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో కాలమే డిసైడ్ చేయాలి.