మే 8 తర్వాత కరోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ : మంత్రి కేటీఆర్ !

Update: 2020-04-30 08:10 GMT
కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సఫలం అయ్యింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఘననీయంగా తగ్గుతూవస్తుంది. దీనితో అతి త్వరలో రాష్ట్రంలో కరోనా కనుమరుగు అవుతుంది అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా చెప్పారు. 2020, మే 08వ తేదీ కల్లా కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుంది అని  వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే దీనికి కారణమన్నారు.

మంత్రి కేటీఆర్ బుధవారం ఆయన ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడారు.  రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా 2020, మే 07వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ,  కంటైన్ మెంట్, క్వారంటైన్, రెడ్ జోన్లను సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతోందని వెల్లడించారు. కరోనా లక్షణాలున్న వారికి, వారి ప్రైమరీ కాంటాక్టులకు పరీక్షలు చేస్తున్నామన్నారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్ మెంట్ విధానాన్ని ఇక్కడ అమలు చేస్తునట్టు అయన తెలిపారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నామని, ఇక వ్యవసాయానికి వస్తే..రాష్ట్రంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ధాన్యం కొనుగోలుకు రైతులకు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో కొనుగోలు కేంద్రాలు  ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తాజాగా నమోదు అవుతున్న కేసులన్నీ  కూడా GHMC పరిధిలో ఉన్నాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. హైదరాబాద్ లో తొలుత నమోదైన కేసులు ఇప్పుడు నమోదు కావడం లేదని, క్రమక్రమంగా ఇక్కడ కూడా తగ్గుముఖం పడుతున్నాయని వైద్యలు వెల్లడిస్తున్నారు. ఇకపోతే , తెలంగాణ ప్రభుత్వం మే 07వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News