దేశంలోనే అత్యున్నత పదవి అయిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవికి ఓ తెలుగు వ్యక్తి అధిరోహించబోతున్నాడు. తెలుగు తేజం.. ప్రముఖ జస్టిస్ ఎన్వీ రమణ తదుపరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (సీజేఐ) గా బాధ్యతలు స్వీకరించేందుకు మార్గం సుగమం అయ్యింది.
ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వారసుడి పేరును సిఫారసు చేయాలని ప్రభుత్వం సీజేఐని కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎన్వీ రమణ పేరును సీజేఐ బాబ్డే సిఫారసు చేసినట్టు సమాచారం.
కేంద్రన్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం జస్టిస్ బాబ్డేకు ఓ లేఖ రాసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు వ్యక్తి సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్ గా కాబోతున్నారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం జస్టిస్ బోబ్డే తరువాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమణనే.
జస్టిస్ ఎన్వీ రమణ ఏపీలోని ఓ రైతు కుటుంబం నుంచి వచ్చారు. 1957 ఆగస్టు 27న ఏపీలోని కృష్ణ జిల్లాలో జన్మించారు. 1983లో న్యాయవాదిగగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పదోన్నతిపై 2014లో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.