అగ్రరాజ్యం అమెరికా మళ్లీ ఉలిక్కిపడింది. ఈసారి క్యాసినో నగరం లాస్ వెగాస్ ను కాల్పులు హడలెత్తించాయి. మండాలే బే హోటల్ లో గుర్తు తెలియన వ్యక్తి కాల్పులు జరిపాడు. ఆదివారం రాత్రి పాటల కచేరి జరుగుతున్న సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే సరిగ్గా అమెరికా పర్యటనకు వెళ్లిన తెలుగువాళ్లు లాస్ వెగాస్ లో చిక్కుకున్నారు. షూటౌట్ జరిగిన మండేలా బే హోటల్ పక్కనే ఉన్న బెలిజియా హోటల్ లో మన తెలుగువాళ్లు బస చేశారు. వాళ్లు అక్కడి అనుభవాలను పంచుకున్నారు.
అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి మ్యూజిక్ ఫెస్టివల్ లో కాల్పులు జరిగాయి. ఆ ఘటన సమయంలో తెలుగు జర్నలిస్టు ఒకరు సమీపంలోనే ఉన్నారు. ఆయన తన అనుభవానాలను ఓ మీడియా సంస్థతో ఫోన్లో పంచుకున్నారు. సదరు జర్నలిస్టుతో పాటు మరో అయిదుగు ప్రస్తుతం అమెరికా టూర్ కు వెళ్లారు. ఈ టూర్ లో ఉండగానే..లాస్ వెగాస్ లో కాల్పులు ఘటనతో ఒక్కసారిగా ఉలికిపడ్డారు. కాల్పుల ఘటన జరగ్గానే లాస్ వెగాస్ రహదారులను మూసివేనట్లు జర్నలిస్టు ఫోన్లో ఈ సందర్భాన్ని పంచుకున్నాడు. మిత్రులు కూడా కొందరు ఆ హడావుడిలో విడిపోయినట్లు వివరించాడు. అయితే సమీప హోటల్ ప్రాంతంలోనూ జనం అంతా భయంతో నేలపై వాలారని, ఆ అయోమయంలో ఏం చేయాలో అర్థంకాక, తాము కూడా నేలపై పడుకుంటున్నట్లు తెలిపారు. అయితే జనం పరుగుల మధ్య తమ మిత్రులందరూ చెల్లాచెదురు అయ్యారని గుర్తు చేశాడు. అయితే ఈ కలకలం నుంచి తేరుకొని కొన్ని గంటల తర్వాత మళ్లీ ఒక్కొక్కరుగా బెలిజియా హోటల్ కు మిత్రులు చేరుకున్నారని లాస్ వెగాస్ షూటింగ్ ఘటనను సదరు జర్నలిస్టు వివరించారు.
కాగా, వెగాస్ కాల్పుల్లో 20 మంది మృతి చెందగా, మరో వంద మంది గాయపడ్డారు. ప్రస్తుతం లాస్ వెగాస్ లో విమానాలను రద్దు చేశారు. అక్కడ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసినట్లు తెలుస్తోంది.