ఈ పాపం ఎవ్వరిది? అప్పుడే పుట్టిన 10 మంది పసికందులు అగ్నికి ఆహుతయ్యారు..!
మహారాష్ట్ర భందరా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం జరిగింది. అప్పుడే పుట్టిన 10 మంది నవజాత శిశువులు అగ్నికి ఆహుతయ్యారు. ఏ ప్రమాదం ఎలా జరిగిందే తెలియదు. ఎవరి నిర్లక్ష్యమే అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి ఐసీయూలో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న 10 మంది శిశువులు పొగకు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆస్పత్రి సిబ్బంది కొందరిని కాపాడగలిగారు. ఆస్పత్రిలోనే పిల్లలు చనిపోవడంతో ఆ తల్లిండ్రులకు కడుపుకోత మిగిలింది. ఈ సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకే సారి పది మంది నవజాతా శిశువులు మృత్యుపాలవడంతో నివ్వెర బోతున్నారు.
శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసీయూలో మంటలు చెలరేగినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఆ సమయంలో 17 మంది చిన్నారులు ఉన్నారు. అక్కడున్న ఆస్పత్రి సిబ్బంది ఏడుగురు చిన్నారులను కాపాడగలిగారు. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది. ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ అయ్యిందా? మంటలు ఎలా వ్యాపించాయి అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఇటీవల కాలంలో ఆస్పత్రిలో మంటలు చెలరేగే ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. కొంత కాలం క్రితం ఏపీలోని విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో మంటలు చెలరేగి ఐసీయూలో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్లు చనిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఒకే సారి పది మంది పసి కందులు కన్నుమూయడం విషాదంగా మారింది.