తనపై లైంగిక దాడి జరగలేదు.. మాట మార్చిన ప్రముఖ టెన్నిస్ స్టార్

Update: 2021-12-21 00:30 GMT
ప్రముఖ టెన్నిస్ స్టార్ పెంగ్ షువాయి మాట మార్చింది. ఈ చైనా టెన్నిస్ స్టార్ చైనా మాజీ వైస్ ప్రీమియర్ పై లైంగిక దాడి ఆరోపనలు చేసింది. కాసేపటికే వాటిని తొలగించింది. గత నెలలో జరిగిన ఈ ఘటన తర్వాత పెంగ్ మాయం కావడంతో పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. ఈ విషయంలో అంతర్జాతీయ టెన్నిస్ స్టార్లు సైతం ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ వీడియోలో మాట్లాడిన పెంగ్ తాను అసలు ఎవరిపై ఆరోపణలు చేయలేదని చెప్పింది. అందుకు సంబంధించిన వార్తలు తాజాగా వైరల్ అయ్యాయి. 'నేనెప్పుడూ ఎవరిపై లైంగిక వేధింపుల ఆరోపణలు, ఫిర్యాదులు చేయలేదు. ఈ విషయాన్నిస్పష్టం చేస్తున్నానని ' పెంగ్ తెలిపింది.

నవంబర్ 2న ఆమె సామాజిక మాధ్యమాల్లోనే చైనా మాజీ వైస్ ప్రీమియర్ జాంగ్ గవోలీపై చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా అది తన వ్యక్తిగత విషయమని చెప్పింది. దాన్ని ప్రజలంతా తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించింది.అయితే ఈ విషయంపై పూర్తి సమాచారం ఇవ్వలేదు.

ఈ పోస్టు అనంతరం పెంగ్ బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పోయేసరికి చైనా అధికార పత్రిక ఆమె క్షేమంగానే ఉన్నట్టు డబ్ల్యూటీఏ చీఫ్ స్టీవ్ సైమన్ కు ఈమెయిల్ చేసింది. అయితే దీనిపై అప్పట్లో స్టీవ్ అనుమానం వ్యక్తం చేశారు.

ఆమె ఈ మెయిల్ స్క్రీన్ షాట్లను వీడియోలో చూపించగా.. అది తాను స్వయంగా రాసిందేనని తాజాగా పెంగ్ చెప్పింది. తాను ఎక్కడా మాయం కాలేదని.. స్వేచ్ఛగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News