బంజారా హిల్స్ స్థల వివాదంలో ఏ-5 నిందితుడిగా టీజీ వెంకటేశ్..

Update: 2022-04-19 06:31 GMT
హైదరాబాద్లోని జూబ్లిహిల్స్ లో 2250 చదరపు గజాల స్థలం వివాదంగా మారింది. ఈ స్థలం ప్రభుత్వానిదని చెబుతుండగా కొందరు ప్రైవేట్ వ్యక్తులు తమదేనంటూ కొందరిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఈ వివాదంలో 58 మందిని అరెస్టు చేశారు. అయితే ఇందులో ఏపీ ఎంపీ టీజీ వెంకటేశ్ ఏ-5గా కేసు నమోదు చేశారు. అరెస్టయిన వారు ఇచ్చిన సమాచారం మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. ఏ-1 గా సినీ నిర్మాతగా ఉన్న టీజీ విశ్వ ప్రసాద్ ఉన్నారు. ఏపీ జెమ్స్ ప్రధాన భద్రతా అధికారి నవీన్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిపై కేసు నమోదు చేసినట్లు బంజారా హిల్స్ ఇన్ స్పెక్టర్ నాగేశ్వర్ రావు తెలిపారు. ఇంతకీ ఈ స్థలం ఎవరిదీ..? వివాదం ఎందుకు ఏర్పడింది..?

బంజారాహిల్స్ ఎస్ఐ నాగేశ్వర్ రావు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ 10 లో 2250 చదరపు గజాల స్థలన్ని ఏపీ జెమ్స్ అండ్ జువెల్లర్ కు 17 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం కేటాయించింది. దీంతో రెండెకరాల్లో నిర్మాణం చేపట్టిన సంస్థ జెమాలజీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల నిర్వహణకు ప్రముఖ వజ్రాల వ్యాపారి మొహల్ చోక్సీతో ఒప్పందం కుదుర్చుకుంది.

కానీ ఏస్ తో న్యాయపరమైన చిక్కులు రావడంతో ప్రభుత్వం ఓ ప్రతినిధిని నియమించింది. ఇదిలా ఉండగా దోమల్ గూడకు చెందిన డాక్టర్ పీవీఎస్ శర్మ ఆ స్థలం తనదేననని ఇతరులకు కొంతభాగంగ విక్రయించారు. స్థలాన్నికొన్నవారిలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, పీ మీడియా ఇన్ ఫ్రా నిర్వాహకుడు, సినీ నిర్మాత టీజీ శిశ్వ ప్రసాద్ ఉన్నారు. మిగిలిన స్థలాన్ని డెవలప్ మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నాడు.

ఈ తరుణంలో కొంతమంది స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆదివారం పెద్ద ఎత్తున కార్లలో వచ్చారు. అక్కడ నిర్మాణాలు జరుగుతున్న వాటిని జేసీబీలతో కూల్చివేయించారు. అయితే వీరికి ఏపీ జేమ్స్ అండ్ జ్యూవెల్లరీస్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుపడగా వారికి గాయాలయ్యాయి. ఇక కొందరు సిబ్బందిపై కత్తులు, సుత్తులు, కొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న 58 మందిని అరెస్టు చేసి వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు.

అయితే వివేకానంద్ నగర్ కు చెందిన మిథున్ అల్లు, పులిశెట్టి సుభాష్ లను ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా.. కస్టడి నుంచి తప్పించుకొని పారిపోయారని పోలీసులు తెలిపారు. అంతకుముందు వారు టీజీ వెంకటేశ్, టీజీ విశ్వప్రసాద్ మద్దతుతోనే ఇలా చేశామని వాంగ్మూలంలో పేర్కొన్నట్లు చెప్పారు. దీంతో కొందరిపై కేసు నమోదు చేశామన్నారు. అంతకుముందు రూ.100 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించుకునేందుకు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారని, ఇందులో టీజీ విశ్వ ప్రసాద్ మరో సినీ నిర్మాత సుభాష్ పులిశెట్టి, మల్లప్పలతో కలిసి ప్రయత్నాలు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ స్థలానికి హక్కుదారులం తామేనని టీజీ విశ్వప్రసాద్ ఓ వీడియోలో చెప్పారని అన్నారు.

దాడి నేపథ్యంలో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ఆదివారం ఈ భవనంలో ఓ సిని పూజా కార్యక్రమం ఉందని, దీంతో ఊరి నుంచి ప్రజలు వచ్చారని అన్నారు. అంతేగాని వారి వద్ద ఎలాంటి మారణాయుధాలు లేవని అంటున్నారు. మరోవైపు ఈ వివాదంలో టీజీ వెంకటేశ్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మరోవైపు ఈ స్థలం ప్రభుత్వానిదేనని రెవెన్యూశాఖ స్పష్టం చేసింది. రోడ్ నెంబర్ 10లోని 403 సర్వేనంబర్ లో దాదాపు రూ.100 కోట్ల విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం అప్పుడే ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.
Tags:    

Similar News