టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ నోట సంచలనాత్మక వ్యాఖ్యలు వెలువడ్డాయి. బీజేపీ - చంద్రబాబు మధ్య ఇలాంటి చర్య వచ్చిందో లేకుంటే టీజీ యథాలాపంగా అన్నారో కానీ చంద్రబాబు రాష్ర్టపతి పదవికి వెళ్లిపోవాలని.. రాష్ర్టాన్ని లోకేశ్ అప్పగించాలని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలు ఒక్కసారిగా పార్టీలో కలకలం సృష్టించాయి. నిజంగా అలాంటి ప్రయత్నం జరుగుతోందా అన్న చర్చ మొదలైంది.
చంద్రబాబు రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని దేశంలో ఒకటి రెండు పార్టీలు మినహా అన్ని పార్టీలు సమర్ధిస్తున్నాయని టీజీ అన్నారు. లోకేష్ కు రాష్ట్రాన్ని అప్పగించడం సరైన చర్య అన్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన టీజీ ఇక్కడున్న హేమాహేమీలను వెనక్కు నెట్టి రాజ్యసభ సీటు కొట్టేశారు. టీడీపీని నమ్ముకుని దశాబ్దాలుగా ఉన్న వారు పోటీ పడినా రాజ్యసభ స్థానం మాత్రం ఆశ్చర్యంగా టీజీ వెంకటేష్ కు దక్కింది. టీజీకి రాజ్యసభ ఎంపీ సీటు రావడం వెనుక నారా లోకేష్ ప్రమేయం ఉందని అందరూ చెబుతుంటారు.
ఆ కారణంగానే ఆయన లోకేశ్ పై అభిమానం చాటుకుంటూ.. అదేసమయంలో ఆయన సీఎం అయితే తనకు మరింత మంచిదని భావిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనుకుంటున్నారు. మొత్తానికి టీజీ టీడీపీలో ఒక్కసారిగా వేడి పుట్టించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/