పచ్చటి పొలాలతో - కొబ్బరి తోటలతో - అరటి తోటలతో విలసిల్లే కోనసీమను అప్పుడప్పుడు కొన్ని సంఘటలు కోనసీమ వాసులకి చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. పదే పదే ఈ ప్రాంతంలో ప్రమాదాలు సంభవిస్తున్నా సరైన చర్యలు తీసుకోవడం లేదు. తాత్కాలిక ఉపశమనాలకి చర్యలు తీసుకోవడమే తప్ప - శాశ్వత పరిస్కారం చూపడంలేదు. 1995 - జనవరి 8 న ఆకుపచ్చటి దుప్పటి పరుచుకున్నట్లు కనిపించే తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామం ప్రజలంతా ఉదయాన్నే నిద్రలేచి ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. అంతే ఒక్కసారిగా సంభవించిన భారీ శబ్ధంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఆ శబ్ధం ఏంటా అనే తేరుకునేలోగానే ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఓ మంట పైకెగసింది. వెంటనే సైరన్ మోగడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోయారు.
చమురు అన్వేషణలో భాగంగా పాశర్లపూడి 19సెక్టార్ వద్ద ఓఎన్ జీసీ సంస్థ జరుపుతున్న డ్రిల్లింగ్ పనుల్లో జరిగిన పొరపాటు వల్ల గ్యాస్ బయటికి లీకై మంటలు అంటుకున్నాయి. అంత మంట తాకిడికి సమీపంలోని కొబ్బరిచెట్లన్నీ క్షణాల్లోనే మాడి మసైపోయాయి. అప్పటివరకు చిన్న గ్యాస్ లీకులే చూసిన కోనసీమ ప్రజలు ఈ భయానక దృశ్యాన్ని చూసి అల్లాడిపోయారు. బ్లో అవుట్ నుంచి వచ్చే వేడి వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెట్లన్నీ క్రమంగా చనిపోయాయి. ఈ బ్లో అవుట్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్లో అవుట్‌గా రికార్డులకెక్కింది.
అంశంలోనే ఎందరో నిపుణులు బ్లో అవుట్ ను ఆర్పేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత విదేశాలకు చెందిన కొందరు నిపుణులు సహకారంతో 65 రోజుల తర్వాత బ్లో అవుట్ ను ఆర్పగలిగారు. జనవరి 8న సంభవించిన ఈ బ్లో అవుట్ మార్చి 15న అదుపులోకి రావడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు దేశ నలుమూలల నుండి వచ్చేవారు. 1995కి ముందు, తర్వాత కోనసీమలో చిన్నచితకా బ్లో అవుట్ లు సంభవించినా 1995లో చెలరేగిన పాశర్లపూడి బ్లో అవుట్ మాత్రం మరిచిపోలేని చేదు జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఈ ఘటనకి నేటితో 26 ఏళ్లు పూర్తి అయ్యాయి. 1997లో రావులపాలెం మండలం దేవరపల్లిలో బ్లో అవుట్ సంభవించి, దానంతటదే ఆరిపోయింది. 2005 సెప్టెంబర్‌లో పాశర్లపూడి స్ట్రక్చర్ లోని తాండవపల్లిలో మమరోసారి బ్లో అవుట్ సంభవించింది.