కోడలను హత్తుకొని కరోనా అంటించిన అత్త

Update: 2021-06-02 00:30 GMT
ఓ శాడిస్టు అత్త తనకు కరోనా వచ్చిందని..తాను పోతానని భయపడింది. ఇంటి కోడలు దూరం దూరంగా ఉంటూ వివక్ష చూపించడంతో కోపంతో రగిలిపోయింది. నాకు వచ్చిన రోగాన్ని కోడలుకు, ఆమె పిల్లలకు అంటించాలని కుట్రపన్నింది. కోడలను బలవంతంగా హత్తుకుంది. దీంతో కొద్దిరోజులకు కరోనా కోడలుకు సైతం రాగా ఆమెను.. పిల్లలతోపాటు ఇంటి నుంచి గెంటేసింది. ఈ శాడిస్టు అత్త చేష్టలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ కు చెందిన ఓ మహిళకు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారిపేటకు చెందిన యువకుడితో మూడేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. వారికి ఓ కొడుకు, కూతురు. భర్త ఉపాధి కోసం 7 నెలలకు ఒడిశా వెళ్లాడు. అత్తా, కోడలు ఇక్కడే ఉంటున్నారు.

అయితే అత్తకు ఇటీవల కరోనా సోకింది. దీంతో అత్తను హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స చేయించింది కోడలు. కోడలు దూరంగా ఉండడాన్ని చూసి జీర్ణించుకోలేని అత్త తన శాడిజం చూపించింది. నేను చనిపోతే హాయిగా బతుకుతారా? అంటూ కోడలిని తరచూ ఆలింగనం చేసుకుంది. పిల్లలను అలానే చేసింది.

దీంతో ఇటీవల కోడలు సైతం కరోనా బారినపడింది. చిన్నపిల్లలతో ఆ కోడలను ఇంటి నుంచి బయటకు గెంటేసింది అత్త. కోడలు కుటుంబం ఈ విషయం తెలుసుకొని గొల్లపల్లిలోని వారి సొంతింటికి తీసుకొచ్చి క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందించారు.

అయితే కోడలు పట్ల అత్త ప్రవర్తించిన తీరుపై స్థానికులు మండిపడ్డారు. అధికారులకు ఫిర్యాదు చేశారు. అత్తపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Tags:    

Similar News