కాంగో నదిలో ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నదిలో పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో 60 మంది ప్రయాణికులు మృతి చెందారు. మాయి నోడోంబీ ప్రావిన్స్ లోని లాంగోలా ఎకోటి గ్రామానికి సమీపంలోని నదిలో ఓడ ప్రమాదవశాత్తు ఓడ బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో ఓటలో 700 మంది ప్రయాణికులున్నారని కాంగో మంత్రి ఎంబీకాయి వెల్లడించారు. పడవ మునిగిన తర్వాత 60 మంది మృతదేహాలను వెలికి గాయగా, మరి కొంత మంది గల్లంతయ్యారని మంత్రి తెలిపారు.
అయితే ఓడలో ఉన్న వారిలో 300 మంది వరకు ప్రాణాలతో బయటపడినట్లు చెప్పారు. ఈ ఓడ కిన్హాసా నుంచి బయలుదేరి భూమధ్య రేఖ ప్రావిన్స్ వైపు వెళ్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. పడవలో ఎక్కువ మంది ప్రయాణికులు ఉండటంతో అధిక లోడ్ అయి పడవ మునిగిపోయినట్లు మంత్రి తెలిపారు. అయితే పడవ మునిగినట్లు సమాచారం తెలియగానే సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
కాంగోలో పడవ ప్రమాదాలు సర్వసాధారణం. ఎందుకంటే సామర్ధ్యానికి మించి ప్రయాణికులు, సరుకులను రవాణా చేస్తారు. అంతేకాదు, పడవలో ప్రయాణించే చాలా మంది లైఫ్ జాకెట్లు కూడా ధరించరు. గత నెలలో కివు సరస్సులో పడవ మునిగి ఇద్దరు చిన్నారుల సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇక, గతేడాది మేలో ఇదే సరస్సులో పడవ మునిగిపోయిన ఘటనలో 10 మంది చనిపోయారు.