టెక్నాలజీ పెరిగిపోవడంతో ఆన్ లైన్ వేదికల ద్వారా విద్వేశం.. హింస పెరిగిపోతున్న ఆరోపణల నేపథ్యంలో అమెరికన్ సెనెట్ లో జ్యడిషియరీ కమిటీ ఎదుట తాజాగా విచారణ జరిగింది ఈ విచారణకు ప్రపంచంలోనే టాప్ 4 దిగ్గజాలు హాజరయ్యారు. ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్.. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బోజెస్, యాపిల్ సీఈవో టిమ్ కుక్.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ లు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గూగుల్, ఫేస్ బుక్ లు తమ మార్కెట్ ప్రాబల్యాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని అమెరికన్ సెనెట్ సభలో డెమొక్రాట్లు, రిపబ్లికన్ల నుంచి టెక్ దిగ్గజాలకు ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. సెనెటర్లు ఈ నలుగురు సీఈవోలను నిలదీసి కడిగిపారేశారు. మార్కెట్ వాటా కోసం చిన్న సంస్థలను దారుణంగా నలిపేస్తున్నాయని కాంగ్రెస్ సభ్యులు సీఈవోలపై విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా గూగుల్-ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ కు ప్రతినిధుల నుంచి తీవ్ర ఆరోపణలు, ప్రశ్నలు ఎదురయ్యాయి. గూగుల్ కంటెంట్ చోరీకి పాల్పడుతోందని.. యెల్ఫ్ ఇంక్ నుంచి గూగుల్ రివ్యూలను దొంగిలిస్తోందని.. అడిగితే సెర్చి రిజల్ట్ నుంచి యెల్ఫ్ ను డిలీట్ చేస్తామని గూగుల్ బెదిరిస్తోందని ఓ సభ్యుడు నిలదీశాడు. ఈ ఆరోపణలపై తాను సమీక్షించి సభకు వివరిస్తానని సుందర్ పిచాయ్ బదులిచ్చారు.
ఇక ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ కు ఇన్ స్టాగ్రామ్ పెనుముప్పు అనే కొనేశారని.. మిగతా కంపెనీల కంటెంట్, ఫీచర్లు కొన్నింటిని ఫేస్ బుక్ కాపీ కొట్టిందని సభ్యులు నిలదీశారు. దీనికి జుకర్ బర్గ్ కూడా అంగీకరించారు. ఇలా నలుగురు టెక్ దిగ్గజాలను అమెరికన్ సెనెట్ సభ్యులు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు.