తెలుగు రాష్ట్రాల అప్పుల లెక్కలు బయటపెట్టిన కేంద్రం

Update: 2022-12-19 15:38 GMT
తెలుగు రాష్ట్రాలు అప్పుల కుప్పలవుతున్నాయి. ఈ భారం పెరిగి జనాల నెత్తిన పడుతోంది. ఏపీ, తెలంగాణ అప్పుల లెక్కలను కేంద్రం బయటపెట్టడం సంచలనమైంది. బీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానమిచ్చింది. దేశంలోని రాష్ట్రాల వారీగా అప్పుల జాబితాను కేంద్రం బయటపెట్టింది.

ఏపీలో ఏటేటా అప్పులు భారీగా పెరిగినట్టు కేంద్రం పేర్కొంది. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు ఏకంగా రూ.2.29 లక్షల కోట్లుగా పేర్కొంది. ప్రస్తుతం ఆ రుణం రూ.3.98 లక్షల కోట్లకు పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఏపీ జీడీపీలోనూ మూడేళ్లుగా అప్పుల శాతం పెరిగినట్టు వెల్లడించింది. 2015లో జీడీపీలో అప్పుల శాతం 23.3 శాతంగా ఉండగా.. 2021 నాటికి అది 36.5 శాతానికి పెరిగినట్టు వెల్లడించింది.

ఇక తెలంగాణలోనూ అప్పుల భారం పెరుగుతోందని తెలిపింది. 2018లో రూ.1.60 లక్షల కోట్లుగా ఉన్న అప్పులు 2022 నాటికి రూ.3.12 లక్షల కోట్లకు చేరాయి. 2017-18 నాటికి గతంతో పోలిస్తే 18.7 శాతం అప్పులుంటే.. 2021-22 నాటికి 16.7 శాతంగా ఉన్నట్టు స్పష్టం చేసింది.

రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలోనూ గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతూ పోతోందని కేంద్రం తెలిపింది. 2016లో రాష్ట్రస్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 15.7 శాతం ఉండగా.. ఆ తర్వాత భారీగా పెరుగుదల నమోదైనట్టు కేంద్రం తెలిపింది. 2022 నాటికి తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 27.4 శాతం అప్పులు నమోదయ్యాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News