ఆత్మహత్య కి అనుమతి ఇవ్వాలంటూ గవర్నర్‌ , హైకోర్టు కి లేఖ రాసిన ఆ కుటుంబం !

Update: 2020-09-04 09:50 GMT
మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాము అనుమతి ఇవ్వాలంటూ ఒక కుటుంబం రాష్ట్ర   , హైకోర్టుకు లేఖలు రాసింది. అసలు అలా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి అసలు కారణం ఏంటి అంటే .. వారి ఊరి వాళ్లే వారిని వెలి వేసారట. ఈ  దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన సీఎం జగన్ వరకు వెళ్లి కలెక్టరుతో విచారణ జరిపించే వరకు వ్యవహారం వెళ్లింది. అసలు ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ..

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, ఊరికి చెందిన మూడున్నర ఎకరాల పొలాన్ని అక్రమంగా తన పేరిట రాయించు కున్నందుకు  అతడి కుటుంబాన్ని గ్రామం నుంచి వెలి వేస్తున్నట్లు గ్రామ పెద్దలు పంచాయితీలో తీర్పు ఇచ్చారు. ఆ కుటుంబానికి చెందిన ఎవరితోనైనా మాట్లాడితే పది వేల రూపాయల జరిమానా విధిస్తామని కూడా మిగిలిన గ్రామ ప్రజలని  హెచ్చరించారు. గ్రామ పెద్దల తీర్పుతో , ఆ రోజు నుండి  ఆ కుటుంబంతో  గ్రామస్థులు సంబంధాలు తెంచుకున్నారు. అయితే , ఈ ఘటన పై  వెంకటేశ్వర్లు మనవరాలు కొన్ని నెలల కిందటే దీనిపై సీఎం జగన్ కి లేఖ రాసింది.

దీనితో ఆయన ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కలెక్టర్‌ కు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ ఆ ఊరికి వెళ్లి గ్రామస్థులకు సర్ది చెప్పి , ఆ కుటుంబంతో కూడా కలిసి మెలిసి ఉండాలని చెప్పారు. ఆ తర్వాత కూడా అదే పరిస్థితి. వారిని గ్రామస్తులందరూ కూడా ఉరికి దూరంగానే ఉంచారు. దీంతో ఇప్పుడు ఆ కుటుంబం తాము సామూహికంగా ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ కు, హైకోర్టుకు లేఖలు రాసింది. గ్రామస్థులందరూ వెలివేయడంతో తాము ఏడాదిగా నరకం చూస్తున్నామని వాళ్లు చెప్తున్నారు. దీనితో అందరి దృష్టి ఇప్పుడు ఆ గ్రామం పై పడింది. దీనితో  మరోసారి అధికారులు జోక్యం చేసుకుని ఈ  సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
Tags:    

Similar News