భార‌త‌దేశంలో అత్య‌ధిక ఆదాయం సంపాదించిన క‌ట్ట‌డం ఇదేనా?

Update: 2022-07-21 04:22 GMT
భార‌త‌దేశం ప్ర‌పంచంలోనే ఏడో పెద్ద దేశం. ఎన్నో సుంద‌ర ప్ర‌దేశాల‌కు, ప్ర‌కృతి నెల‌వైన కేంద్రాల‌కు, మ‌రెన్నో ఆధ్యాత్మిక‌, విహార కేంద్రాల‌కు నెల‌వు. మూడు వైపులా స‌ముద్రం కూడా ఉండ‌టంతో ఎన్నో అంద‌మైన బీచ్ లు ఉన్నాయి. అలాగే హిందూ మత కేంద్రాలే కాకుండా బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మ‌తాల‌కు చెందిన ఎన్నో ప‌విత్ర పుణ్య‌క్షేత్రాలు దేశంలో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో భార‌త‌దేశాన్ని సంద‌ర్శించ‌డానికి దేశ‌విదేశాల నుంచి ప‌ర్యాట‌కులు వ‌స్తున్నారు.

ఈ నేప‌థ్యంలో దేశంలోనే అత్య‌ధిక ఆదాయం స‌మ‌కూర్చిపెడుతున్న చారిత్రిక క‌ట్ట‌డంగా ఆగ్రాలోని తాజ్ మ‌హ‌ల్ నిలిచింది. మన దేశంలోని పర్యాటకుల్ని మాత్ర‌మే కాకుండా విదేశీ ప‌ర్యాట‌కుల‌ను సైతం ఇది విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ క్ర‌మంలో తాజ్ మహల్‌కు మూడేళ్లలో దాదాపు రూ.132 కోట్ల ఆదాయం సమకూరినట్లు 'ద ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తాజాగా వెల్లడించింది.

కోవిడ్ సంక్షోభ స‌మ‌యంలోనూ ఇతర పర్యాటక ప్రదేశాలతో పోలిస్తే తాజ్ మహల్‌కే ఎక్కువ ఆదాయం సమకూరినట్లు ఏఎస్ఐ తెలిపింది. 2019-20 కాలంలో కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ రూ.97.5 కోట్ల ఆదాయం పొందింది.

తాజ్ మహల్‌కు 2019-20 కాలంలో రూ.97.5 కోట్లు, 2021-22 కాలంలో రూ.25.61 కోట్ల ఆదాయం సమకూరింది. ప్ర‌వేశ‌ టిక్కెట్ల ద్వారానే ఎక్కువ ఆదాయం వ‌స్తోంది. కోవిడ్ సంక్షోభ స‌మ‌యంలో ఇతర పర్యాటక ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు పెద్దగా ఆదరణకు నోచుకోలేదు.

కాగా దేశంలో ద ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆధ్వర్యంలో అనేక చారిత్రక ప్రాంతాలున్నాయి. ఈ ప్రదేశాలకు వచ్చే వారికి ఎంట్రీ ఫీజులు, ఇతర సేవల విషయంలో ఛార్జీలు వసూలు చేస్తుంటారు. ఇలా ఏఎస్ఐకి భారీ ఆదాయం వ‌స్తోంది. అయితే, ఏఎస్ఐకి వస్తున్న ఆదాయంలో ఏకంగా 24 శాతం తాజ్ మహల్ ద్వారానే వస్తుండటం విశేషం.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏఎస్ఐ ఆధీనంలో 3,693 చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వాటిలో 143 ప్రదేశాల్లోకి టిక్కెట్ల ద్వారా పర్యాటకుల్ని అనుమతిస్తున్నారు. తాజ్ మహల్ తర్వాత ఎక్కువ ఆదాయం వ‌స్తున్న‌ ప్రదేశాల్లో ఢిల్లీలోని కుతుబ్ మినార్, ఎర్రకోట, ఒడిశాలోని కోణార్క్‌లో ఉన్న‌ సూర్యదేవాలయం, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఖజురహో, మ‌హారాష్ట్ర‌లోని ఎల్లోరా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఆగ్రా కోట వంటివి ఉన్నాయి.
Tags:    

Similar News