ది హిందూ... తొలిసారి ప్రింటింగ్ ఆగింది​

Update: 2015-12-02 13:06 GMT
ప్ర‌ముఖ మీడియా సంస్థ ది హిందూ బుధ‌వారం ద‌ర్శ‌నం ఇవ్వ‌లేదు. 1878లో ఈ ఇంగ్లిషు దిన‌ప‌త్రిక ప్రారంభించిన త‌ర్వాత‌.. గ‌డిచిన 137 సంవ‌త్స‌రాల్లో హిందూ ప్రింటింగ్ ఆగింది లేదు. ప్ర‌త్యేక ప‌ర్వ‌దినాల్లో మిన‌హా.. మిగిలిన ఏ రోజూ.. ఎలాంటి ప‌రిస్థితులు ఎదురైన‌ప్ప‌టికీ దిన‌ప‌త్రిక ప్ర‌చురించ‌కుండా ఉండ‌లేదు. కానీ.. బుధ‌వారం మాత్రం ది హిందూ బ‌య‌ట‌కు రాలేదు.

దీనికి కార‌ణం.. చెన్నై మీద విరుచుకుప‌డిన భారీ వ‌ర్షాలేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. చెన్నై న‌గ‌రానికి దాదాపు 30 కిలోమీట‌ర్ల దూరంలో మ‌రైమ‌లైన‌గ‌ర్‌లో ఈ పత్రిక‌కు ప్రింటింగ్ ప్రెస్ ఉంది. అక్క‌డ‌కు ప్రింటింగ్‌ ప్రెస్ ఉద్యోగులు ఎవ‌రూ చేరుకోలేని ప‌రిస్థితి. తీవ్ర‌స్థాయిలో కురుస్తున్న వాన‌ల‌తో ఉద్యోగులు ఆఫీసుకు చేరుకోలేక‌పోవ‌టంతో హిందూ చరిత్ర‌లో తొలిసారి దిన‌ప‌త్రిక‌ను ప్రింటింగ్ చేయ‌లేదు.

మ‌రోవైపు.. టైమ్స్ ఆఫ్ ఇండియా.. న్యూ ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్‌.. ద‌క్క‌న్ క్రానిక‌ల్ లాంటి ప‌త్రిక‌లు మాత్రం య‌థావిధిగా మార్కెట్లోకి వ‌చ్చాయి. త‌న 137 సంవ‌త్స‌రాల సుదీర్ఘ ప్ర‌యాణంలో ప్ర‌కృతి విప‌త్తు కార‌ణంగా ది హిందూ ప్రింటింగ్ కాక‌పోవ‌టం వార్త‌గా మారింది.
Tags:    

Similar News