ప్రధాని నరేంద్రమోడీకి బెదిరింపు కాల్

Update: 2020-08-11 09:17 GMT
ప్రధాని నరేంద్రమోడీని అంతం చేస్తానంటూ డయల్ 100కు ఫోన్ చేసి బెదిరించాడు ఓ అజ్ఞాత వ్యక్తి. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యి విచారించగా విషయం బయటపడింది.

హర్యానా రాష్ట్రానికి చెందిన హర్భజన్ సింగ్ నోయిడా నగరంలో నివాసం ఉంటున్నాడు. డ్రగ్స్ కు బానిస అయ్యాడు. సోమవారం పోలీస్ ఎమర్జెన్సీ 100కు ఫోన్ చేసి ప్రధాని మోడీకి హాని తలపెడుతానంటూ హెచ్చరించారు.

కాల్ ఆధారంగా పోలీసులు నిందితుడైన హర్భజన్ సింగ్ ను అరెస్ట్ చేశారు. అతడిని పట్టుకొని విచారించగా డ్రగ్స్ కు బానిస అయ్యాడని.. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుసుకొని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పంపించారు.

ఏకంగా ప్రధాని మోడీని ఫోన్ లో బెదిరించిన యువకుడి ఘటన నోయిడాలో సంచలనమైంది.
Tags:    

Similar News