అమెరికా బడ్జెట్ ను పాస్ చేసిన కమల ఓటు

Update: 2021-02-06 09:10 GMT
ఎట్టకేలకు అమెరికా బడ్జెట్ బిల్లు పాస్ అయ్యింది. ఇందుకు దేశ ఉపాధ్యక్షురాలు.. మన మూలాలు ఉన్న కమలా హ్యారిస్ ఓటు కీలకమైంది. ఇప్పటివరకు కమల ఓటు నిర్ణయాత్మకంగా మారుతుందంటూ సాగిన ప్రచారం నిజమని తేలింది. రిపబ్లికన్లు.. డెమొక్రాట్లు చెరి సగం ఉన్న అమెరికా సెనేట్ లో కమల ఓటు కీలకంగా మారింది. తాజాగా బడ్జెట్ బిల్లు సెనేట్ ముందుకు వచ్చింది.

బడ్జెట్ బిల్లు పాస్ కావాలంటే.. రిపబ్లికన్ల మద్దతు కూడగట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే.. అలాంటిఅవసరం లేకుండా ఉపాధ్యక్ష పదవిలో ఉన్న ఆమె.. తన ఓటును వినియోగించుకున్నారు. దీంతో.. అమెరికా బడ్జెట్ ఎలాంటి అవరోధాలు లేకుండా పాస్ అయ్యింది. ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న  కమలా తొలిసారి తన నిర్ణయాత్మక ఓటును వేయటం గమనార్హం.

బడ్జెట్ పై అంతకు ముందు సెనేట్ లో ఆసక్తికరంగా చర్చ సాగింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం బడ్జెట్ పై ఓటింగ్ నిర్వహించారు. అంతకు ముందు రాత్రంతా సభ్యులు తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. ఉదయం ఓటింగ్ నిర్వహించగా.. అనుకూల.. ప్రతికూల ఓట్లు సమానంగా వచ్చాయి. దీంతో.. కమల తన నిర్ణయాత్మక ఓటుతో బడ్జెట్ బండిని గట్టెక్కించింది. దీంతో అధ్యక్షుడి హోదాలో ఉన్న బైడెన్ ప్రకటించిన రూ.138లక్షల కోట్ల కరోనా రిలీఫ్ ప్లాన్ కు ఎలాంటి ఆటంకాలు లేని పరిస్థితి నెలకొంది.
Tags:    

Similar News