ఒక ఊపు ఊపి వెళ్లిపోయిన సెకండ్ వేవ్ ఇచ్చిన షాక్ నుంచి తెలుగు రాష్ట్రాలతో సహా యావత్ దేశం ఇంకా బయటకు వచ్చింది లేదు. సెకండ్ వేవ్ కు ముందున్న పరిస్థితులు ఇప్పటికి లేవన్నది నిజం. ఆ మాటకు వస్తే సినిమాథియేటర్లతో పాటు.. మరిన్ని వ్యాపారాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇలాంటివేళ.. మూడో వేవ్ ముంచుకొస్తుందన్న మాట విన్నంతనే వణికిపోయే పరిస్థితి. దీనికి తోడు.. కరోనా మొత్తం ఎపిసోడ్ ను చూస్తే.. దేశ వ్యాప్తంగా ఎవరికి నచ్చిన సిద్ధాంతాన్ని వారు చెప్పటం.. ఎవరి వాదన వారిదే అన్నట్లుగా వ్యవహరించటమే తప్పించి.. మొత్తంగా ఒకరు బాధ్యత తీసుకోవటం.. అర్థం లేని ప్రకటనలు చేసే వారికి చెక్ చెప్పటం.. దేశ వ్యాప్తంగా కరోనా ట్రెండ్ కు సంబంధించి ఏమేం జరుగుతుందన్న బులిటెన్ ను రోజువారీగా ఇచ్చి ఉంటే బాగుండేది.
నిజానికి విపత్తువేళ.. ఇలాంటి ఏర్పాటు చాలా అవసరం. కరోనా సమయంలో ప్రజలకు సుపరిచితులుగా మారిన గులేరియా లాంటి కొందరు ప్రముఖులు.. ఎప్పుడో ఒకసారి మాట్లాడటం.. ఐసీఎంఆర్ సైతం అప్పుడప్పుడు స్పందించటం చూశాం. అలా కాకుండా రోజువారీగా కరోనా కేసులు.. తీవ్రత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. కొత్తగా గుర్తించిన ట్రెండ్లు.. కరోనాకు సంబంధించిన ఇతర అంశాల్ని ఒకటి తర్వాత ఒకటి చొప్పున క్లియర్ చేసి ఉంటే.. ఇప్పుడున్నంత గందరగోళం ఉండేది కాదు. సెకండ్ వేవ్ తాలుకూ కేసుల నమోదు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణలో కేసుల నమోదు తగ్గుముఖం పట్టి చాలా కాలమే అయినా.. ఏపీలో మాత్రం కేసుల తీవ్రత ఇంకాకొనసాగుతూనే ఉంది.
ఏపీలోని తూర్పు.. పశ్చిమ గోదావరి జిల్లాల్ని కలిపితే ఇప్పటికి రోజుకు దాదాపు పదిహేను వందలకు పైగా కేసులు నమోదవుతున్న దుస్థితి. సెకండ్ వేవ్ లో సదరు రెండు జిల్లాల్లో నమోదైనన్ని కేసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా చోటు చేసుకోలేదని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మూడో వేవ్ మొదలైందా? ఎప్పుడు మొదలవుతుంది? ఎంత కాలం ఉంటుంది? లాంటి ఎన్నో ప్రశ్నలు వేధిస్తూ.. వెంటాడుతున్నాయి. ఇలాంటి సందేహాలకు సమాధానాలు వెతికితే ఉలిక్కిపడేలా తాజా గణాంకాలు ఉండటం గమనార్హం. మే కు ముందు దేశ వ్యాప్తంగా రోజువారీ కేసులు 30 వేల దిగువకు వెళ్లగా.. కొద్ది రోజుల వ్యవధిలోనే రోజుకు నాలుగు లక్షల కేసులు నమోదైన పరిస్థితి తెలిసిందే.
ఇదిలా ఉంటే గడిచిన 55 రోజుల్లో రోజువారీగా నమోదైన కేసులకు.. ఇటీవల రోజువారీగా నమోదవుతున్న కేసులకు మధ్య వ్యత్యాసం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. జులై 7నుంచి రోజువారీ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరగటం మొదలైనట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన వారంలో నమోదైన కేసుల్ని చూస్తే.. అంతకు ముందు నమోదవుతున్న కేసులకు సంబంధం లేకుండా ఎక్కువగా నమోదవుతున్న వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. దేశంలోని 73 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికి పైనే ఉందన్న విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ తీవ్రత ఎంతలా ఉందన్న విషయం ఈ జిల్లాల్ని చూస్తే అర్థమవుతుందని చెబుతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఐసీఎంఆర్ తాజాగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశంలో డెల్టా వేరియంట్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. దీని వల్లే కేసులు నమోదువుతున్నట్లు చెబుతున్నారు. రోజువారీగా నమోదయ్యే కొత్త కేసులు పెరగటం మూడో వేవ్ ప్రమాద హెచ్చరికగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. దీనికి తోడు ఈ మధ్యనే నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ చేసిన వ్యాఖ్య కూడా మూడో వేవ్ ఇప్పటికే మొదలైందన్న విషయాన్ని చెప్పేస్తుంది.
మొత్తంగా మూడో వేవ్ ఇప్పటికే మొదలైంది. కాకుంటే ప్రాథమిక దశలో మాత్రమే ఉంది. మరిప్పుడు మనమేం చేయలేమా? అంటే.. చేయగలిగింది ముందస్తు జాగ్రత్తల్ని మరింత పక్కాగా అమలు చేయటం మినహా చేయగలిగిందేమీ లేదు. జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరగటం వీలైనంతగా తగ్గించటం.. ముఖానికి మాస్కు వినియోగించటం.. భౌతిక దూరాన్ని పాటించటంతోనే మిమ్మల్ని మీరు.. మీ కుటుంబాల్ని రక్షించుకునే వీలుంది. జర జాగ్రత్త.