నవ్యాంధ్రప్రదేశ్ నూతన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త చరిత్ర సృష్టిస్తున్నట్లుగానే ఉంది. ఇప్పటికే తెలుగు నేలలో రికార్డు మెజారిటీతో విజయం సాధించిన జగన్... రేపు తన కేబినెట్ తో ప్రమాణం చేయించనున్నారు. కాసేపటి క్రితం ముగిసిన వైసీపీ శాసనసభా పక్ష భేటీలో సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న నిర్ణయాలను ప్రకటించిన జగన్... అన్నింటా కొత్త పుంతలే తొక్కారు. 25 మందికి మంత్రులుగా అవకాశం కల్పించనున్నట్లుగా ప్రకటించిన జగన్... వారిలో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించనున్నట్లుగా ప్రకటించారు. ఈ ఐదు డిప్యూటీ సీఎం పదవులు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు సామాజికవర్గాలకు కేటాయించనున్నట్లు ప్రకటించిన జగన్... సగానికి సగం మంత్రి పదవులను రిజర్వ్ డ్ కేటగిరీలకే కేటాయించనున్నట్లుగా ప్రకటించారు. అంతేకాకుండా నామినేటెడ్ పదవుల భర్తీలోనూ రిజర్వేషన్లను అమలు చేయనున్నట్లుగా ప్రకటించి సంచలనం రేపారు.
ఇక ఈ భేటీలో అన్నింటికంటే కూడా సంచలన నిర్ణయంగా చెప్పుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే.. జగన్ కేబినెట్ లో ఎవరు మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినా... వారు కేవలం రెండున్నరేళ్లు మాత్రమే పదవిలో ఉంటారు. రెండున్నరేళ్ల తర్వాత అప్పటిదాకా మంత్రులుగా ఉన్నవారందరినీ ఆ పదవుల నుంచి తప్పించి... కేబినెట్ లో కొత్త వారికి అవకాశం కల్పిస్తారట. ఈ లెక్కన పార్టీలోని మెజారిటీ నేతలకు మంత్రి పదవులు దక్కడమే కాకుండా పాలనలో అందరికీ అవకాశం దక్కుతుందన్న మాట. అంటే రేపు జగన్ కేబినెట్ లో మంత్రులుగా ప్రమాణం చేసే వారు రెండున్నరేళ్ల మాత్రమే మంత్రులుగా కొనసాగుతారు. ఆ తర్వాత వీరంతా మంత్రి పదవుల నుంచి దిగిపోనుండగా... అంతా కొత్తొళ్లే మంత్రులుగా ప్రమాణం చేస్తారన్న మాట.
అంటే ఏదేని అనివార్య పరిస్థితులు వస్తే తప్పించి కేబినెట్ లో మార్పులు చేర్పులు ఉండవన్న మాట. రెండున్నరేళ్ల తర్వాత మాత్రం అప్పటిదాకా మంత్రులుగా ఉన్నవారంతా మాజీలు కాగా... అప్పటిదాకా మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న వారిలో మరో 25 మందికి మంత్రి పదవులు దక్కుతాయన్న మాట. ఇలా ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చి... రెండున్నరేళ్ల తర్వాత మీ పదవీ కాలం ముగుస్తుందని ముందుగానే పార్టీ నేతలకు చెప్పడమంటే చాలా ధైర్యం ఉండాలి. మొత్తంగా ఒకేసారి ఐదుగురు డిప్యూటీ సీఎంలు, ఐదు సామాజిక వర్గాలకు ఆ పదవులు, 25 మంది మంత్రులకు కేవలం రెండున్నరేళ్ల మేరకే మంత్రి పదవి, ఆ తర్వాత అంతతా కొత్తొళ్లకే అవకాశం అంటూ ప్రతి అంశంలోనూ జగన్ కొత్త నిర్ణయాలు తీసుకుని కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని చెప్పాలి.