సోషల్ మీడియాలో వేధిస్తున్నారంటూ ప్రముఖ నటి ఫిర్యాదు

Update: 2021-02-04 14:35 GMT
సెలబ్రెటీలన్నాక వారు ఏదీ మాట్లాడిన ట్రోలింగ్స్, మీమ్స్, సెటైర్లు చాలా సహజంగా పడుతాయి. వాటిని చూసి చూడకుండా వదిలేసి అందరూ తమ కెరీర్ తాము చూసుకుంటున్నారు. అయితే కొందరు నాటు నెటిజన్లు మాత్ర వదలకుండా హింసిస్తుంటారు. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా దూషిస్తుంటారు.ఈ క్రమంలోనే ఓ ప్రముఖ నటి , బీజేపీ నాయకురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత తాజాగా సోషల్ మీడియాలో కొందరు తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని.. అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె గురువారం సిపీ సజ్జనార్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. 'ఓవర్గం సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేసి అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. ఏదైనా కేసులో అమ్మాయిలు పట్టుబడితే అందులో నేను కూడా ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి దారుణాలపై ఇంతకాలం సోషల్ మీడియా వేదికగా పోరాటం చేశా.. ఇప్పుడు మానసికంగా నన్ను మరింత కృంగదీస్తున్నారు. అందుకే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాను అని మాధవీలత పేర్కొన్నారు.ఇలాంటి అభ్యంతరక చర్యలకు పాల్పడుతున్న నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాను అని మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు.
Tags:    

Similar News