టీఆర్ఎస్‌ లో ఉన్న రెడ్డి వ‌ర్గం మౌనం... రీజ‌నేంటి?

Update: 2021-11-09 11:35 GMT
రాజ‌కీయాల్లో సామాజిక వ‌ర్గాల ప్ర‌భావం ఎక్కువ‌ గా ఉంది. రాష్ట్రాలు ఏవైనా.. నాయ‌కులు ఎవ‌రైనా.. పార్టీలు ఎన్న‌యినా.. సామాజిక వ‌ర్గాల సూత్రం ఆధారం గానే రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. పైకి కులం లేదు.. మ‌తం లేదు.. అనే వారు.. తెర‌చాటు రాజ‌కీయాల‌న్నీ.. వాటి ఆధారం గానే చేస్తున్న ప‌రిణామాలు మ‌న‌కు క‌శ్మీర్ నుంచి క‌న్యా కుమారి వ‌ర‌కు క‌నిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ విష‌యం ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. తెలంగాణ లో కీలకంగా ఉన్న రెడ్డి సామాజిక‌వ‌ర్గం.. కొన్నాళ్లు గా సైలెంట్‌ గా ఉండ‌డం.. రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం గా మారింది.

వాస్త‌వానికి ఏపీ తో పోలిస్తే.. తెలంగాణ‌ లో ఢీ అంటే.. ఢీ అనేలా రెడ్డి వ‌ర్గం రాజకీయాలు చేస్తుంది. అటు కాంగ్రెస్‌, ఇటు టీఆర్ ఎస్‌, మ‌రోవైపు.. బీజేపీ లోనూ రెడ్డి వ‌ర్గం దూకుడు ఎక్కువ‌ గానే ఉంది. అయితే.. ఇప్పుడు ఎందుకో..టీఆర్ ఎస్ ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గం నాయకులు మాత్రం సైలెంట్ అయ్యారు. ఇదే విష‌యం.. గ్రామ‌స్థాయి లో చ‌ర్చకు దారి తీసింది. నిత్యం మీడియా లో ఉంటూ.. దూకుడుగా ఉండే.. టీఆర్ ఎస్ రెడ్డి నాయ‌కులు ఇలా సైలెంట్ ఎందుకు అయ్యారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇదే విష‌యం గ్రామీణ స్థాయి లో ఆస్తిక‌ర చ‌ర్చ‌గామారింది.

అయితే.. దీని వెనుక కాంగ్రెస్ చీఫ్‌.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఏమైనా కార‌ణ‌మా? అనే కోణం లోనూ కొంద‌రు దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే.. టీఆర్ ఎస్‌ లో ఉన్న నేత‌ల్లో.. అంద‌రూ కూడా అటు టీడీపీ లేదా.. ఇటు కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన వారే. దీంతో రేవంత్ తెలియ‌ని వారు ఉండ‌రు క‌దా! అందుకే.. ఆయ‌నేమ‌న్నా.. వీరిని మేనేజ్ చేస్తున్నారా? అనే చ‌ర్చ అయితే.. జ‌రుగుతోంది. ఒక‌వేళ ఇది క‌నుక నిజం కాక‌పోతే.. మ‌రేవైనా స‌మ‌స్య‌లు ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా.. ఇటీవ‌ల కాలంలో గ్రామాల్లో ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గం మొత్తం.. కూడా ఫుల్లుగా సైలెంట్ అయిపోయింది.

ప్ర‌స్తుతం రెడ్డి వ‌ర్గం నాడి ఎలా ఉందో తెలియ‌దుకానీ.. ఇటీవ‌ల జ‌రిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈ సామాజిక వ‌ర్గం అనూహ్యం గా వ్య‌వ‌హ‌రించింద‌నే టాక్ ఉంది. ఇక్క‌డ మొత్తం 22 వేల పై చిలుకు రెడ్డి సామాజిక‌వ‌ర్గం ఓట్లు ఉన్నాయి. అయితే.. ఎక్కువ భాగం.. బీజేపీ కి ప‌డ్డాయ‌నే టాక్ వినిపిస్తోంది. అయితే.. పోల్ స‌ర్వే నిర్వ‌హించిన వారికి మాత్రం ఈ సారి కాంగ్రెస్ కు వేస్తామ‌ని చెప్పారట‌. అంటే.. ఇదో వ్యూహం గానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీలకులు. ఎవ‌రో వెనుకాల ఉండి .. ఈ వ‌ర్గాన్ని న‌డిపిస్తున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

ఇదిలా వుంటే, రెడ్డి వ‌ర్గం గ‌తం లో త‌ర‌చుగా ప్రెస్‌మీట్లు పెట్టి.. ప‌దునైన వ్యాఖ్య‌ల‌ తో దూకుడుగా ఉండేది. క‌కానీ, ఇప్పుడు ఎక్క‌డా ఆ ఛాయ‌లు క‌నిపించ‌డం లేదు. క‌నీసం మీడియా ముందుకు కూడా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన టీఆర్ ఎస్ నాయ‌కులు రావ‌డం లేదు. దీనిని బ‌ట్టి వారు పార్టీపై అసంతృప్తితో ఉన్నారా? లేక‌.. మ‌రేదైనా కార‌ణ‌మా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ విష‌యం మాత్రం హాట్ టాపిక్‌ గా చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News